S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/29/2017 - 01:45

రాజమహేంద్రవరం, జూలై 28: అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనుల్లో అధికార యంత్రాంగం నేల విడిచి సాము చేస్తున్నట్టుగా వుంది. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని ఆందోళన వ్యక్తంచేస్తూ పైపులైన్ పనులకు రైతులు అడ్డు తగులుతున్నారు.

07/29/2017 - 01:44

ఒంగోలు,జూలై 28: ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఐదుగురి ఇళ్ళపై అవినీతి నిరోధక శాఖాధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈదాడుల్లో కోట్లరూపాయల ఆస్తులు, బంగారం, నగదు, వెండి ఉన్నట్లు ఎసిబి అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

07/29/2017 - 01:44

విజయవాడ, జూలై 28: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏర్పాటు చేస్తున్న ఆరు స్పోర్ట్స్ అకాడమీలను ఆగస్ట్ 15న ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న నాలుగు వాటర్ స్పోర్ట్స్ అకాడమీలను కూడా అదేరోజు ప్రారంభించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను తీర్చిదిద్దాలని, ఇందుకు స్పోర్ట్స్ అకాడమీలు దోహదపడాలని అభిలషించారు.

07/29/2017 - 00:05

విజయవాడ, జూలై 28: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల పరిస్థితి నేటికీ అగమ్యగోచరంలా కన్పిస్తున్నది. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే అనుబంధం కోసం ఇంటర్మీడియట్ బోర్డుకు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వం ఒకేసారి 300 శాతం పెంచడాన్ని జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం గత నాలుగు మాసాలుగా తీవ్రంగా నిరసిస్తూ వస్తున్నది.

07/29/2017 - 00:04

విజయవాడ, జూలై 28: బీహార్ సిఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. బీహార్ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు మళ్లీ అవకాశం దక్కిందంటూ ప్రశసించారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ మధ్య పరస్పర సహకారం కొనసాగాలని అభిలషించారు. ఇద్దరు నేతలు ఐదు నిమిషాల సేపు ఫోన్‌లో సంభాషించుకున్నారు.

07/29/2017 - 00:04

విజయవాడ, జూలై 28: జగన్ దారి రహదారి కాదు.. అడ్డదారి.. చివరికి చేరేది చంచల్‌గూడ జైలుకే.. సిబిఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లే ఇందుకు నిదర్శనమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పంచుమర్తి అనూరాధ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో అనూరాధ మాట్లాడుతూ నిన్న జగన్ విజయవాడ వచ్చారు.. ఏం మాట్లాడారో మనమందరం విన్నాం..

07/29/2017 - 00:02

విజయవాడ, జూలై 28: ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఏపిఎస్‌ఆర్‌టిసి ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిలపక్షం సదస్సులో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాల, రాజకీయ పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నాటికి ఏపిఎస్‌ఆర్‌టిసి వాటాకు రూ.2700 కోట్ల అప్పులు, నష్టాలు ఉండేవన్నారు.

07/29/2017 - 00:02

విజయవాడ, జూలై 28: రాష్ట్రంలో వివిధ ట్రెజరీ కార్యాలయాల్లో గడచిన మూడేళ్లుగా కొనసాగుతున్న అవినీతి, అక్రమాలు ఒకదాని వెంట మరొకటిగా వెలుగు చూస్తున్నాయి. దీనిపై ఆంధ్రభూమి దినపత్రికలో వరుసగా పలు వార్తా కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా గుంటూరు జిల్లాలోని ట్రెజరీలపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశాలు జారీచేసింది.

07/29/2017 - 00:01

విజయవాడ, జూలై 28: విశాఖలో ఏర్పాటు చేయనున్న టియు-142 విమానాన్ని మ్యూజియంగా మార్చేందుకు వీలుగా మరో విడత నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విమానాన్ని వీలైనంత త్వరగా మ్యూజియంగా మార్చేందుకు 5 కోట్ల రూపాయలకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది.

07/29/2017 - 00:01

విజయవాడ, జూలై 28: రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఆగస్టు 3న వెలగపూడి సచివాలయంలో నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం భేటీ కానుంది. నిరుద్యోగ భృతి తదితర అంశాలపై చర్చించనుంది.

Pages