S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/29/2017 - 00:00

విజయవాడ, జూలై 28: పెరుగుతున్న దోమల బెడదను తగ్గించేందుకు దోమల ఉత్పత్తి నిరోధక చట్టం అమల్లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇళ్ళ దగ్గర దోమలు పెరిగే వాతావరణం ఉంటే ఆయా ఇళ్ల యజమానులకు జరిమానా విధించడం ఈ చట్టంలోని కీలక అంశం. పట్టణాల్లో, గ్రామాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేని అంశాన్ని పక్కన పెట్టి, చట్టం పేరుతో ఆదాయంపై దృష్టి సారిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

07/28/2017 - 23:43

పాడేరు, అరకులోయ, జూలై 28: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం మావోయిస్టులు ఎఒబి సరిహద్దులో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకులోయ, చింతపల్లి, సీలేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలను ఆనుకుని ఉన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

07/28/2017 - 23:43

భీమవరం, జూలై 28: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని నిరసిస్తూ ఆయనకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు శుక్రవారం నుండి ఆమరణ దీక్షకు దిగారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో భీమవరం సమీపంలోని రాయలం గ్రామంలోని తన ఇంటి ఆవరణలో ఆయన దీక్ష ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

07/28/2017 - 23:42

పలాస, జూలై 28: మైదాన ప్రాంతాల్లో గజరాజులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని మైదాన ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేయడంతోపాటు బీభత్సం సృష్టిస్తున్న గజరాజులపై ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో గజరాజుల సంచారం సర్వసాధారణం కావడంతో అటవీశాఖాధికారులు కూడా వాటిపై దృష్టి సారించడం లేదని బాధితులు వాపోతున్నారు.

07/28/2017 - 23:42

విజయవాడ, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి రంగంలో మెరుగైన శిక్షణా కార్యక్రమాలను యువతకు అందించడం ద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటోందని ఏపి టాస్క్ఫోర్స్ కమిటీ కన్వీనర్ (్ఫర్మా అండ్ బయోటెక్) శ్రీనివాస్ శంకర్ ప్రసాద్ తెలిపారు.

07/28/2017 - 04:27

విజయవాడ, జూలై 27: ఒలింపిక్స్ పతక విజేత పివి సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ సంబంధిత ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అందచేశారు. వెలగపూడి సచివాలయంలో సింధుకు ఉద్యోగ నియామక పత్రం అందచేసిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గ్రూప్-1 అధికారిగా నియమితురాలైన సింధు.. మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

07/28/2017 - 04:25

విజయవాడ, జూలై 27: కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కాపుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండి ఉంటే రిజర్వేషన్ల అంశంపై ఇటీవల జరిగిన వైఎస్సార్‌సిపి ప్లీనరీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.

07/28/2017 - 04:24

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో 12 బిసి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బాలుర కోసం ఆరు, బాలికల కోసం ఆరు ఏర్పాటు చేయనున్నారు.

07/28/2017 - 04:23

అమరావతి, జూలై 27: టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. దానిపై కేంద్రం సుముఖంగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. తెలుగుదేశంలో కొనసాగుతున్న కొత్త-పాత నేతల్లో అయోమయం, తమ రాజకీయ భవితవ్యంపై గందరగోళం మొదలయింది.

07/28/2017 - 04:20

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 27: రాష్ట్ర ప్రజల ముందు నేడు రెండే దారులు ఉన్నాయి.. అన్యాయం, అరాచకం, అవినీతి దారిలో వెళ్తున్న చంద్రబాబు దుర్మార్గం ఒకటైతే.. ప్రతి నిరుపేదకు విద్య, వైద్యం అందించి, ఆర్థికంగా వెన్నంటి ఉండే రాజన్న సన్మార్గం మరోకటని ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

Pages