S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/28/2017 - 04:19

అద్దంకి, జూలై 27 : ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొనడంతో ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైకాపా నుంచి టిడిపిలోకి ఎమ్మెల్యే గొట్టిపాటి ఆగమనం నుంచి పోరు తీవ్రమైంది. ఒకే పార్టీలో ఉండడంతో ఆధిపత్య పోరు జరుగుతోంది.

07/28/2017 - 04:18

విజయవాడ, జూలై 27: ‘చందన్న బీమా’ పథకం లబ్ధిదారులెవరైనా మరణిస్తే 14వ రోజు సంతాప కార్యక్రమం నిర్వహించి బీమా పరిహారం మొత్తాన్ని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి కార్మికశాఖ అధికారులు, సెర్ప్ అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులతో జరిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

07/28/2017 - 04:30

కాకినాడ, జూలై 27: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధాన్ని ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం విడుదల చేసిన గృహ నిర్బంధ నోటీసులను పోలీసులు ముద్రగడకు అందజేశారు.

07/28/2017 - 04:12

విజయవాడ, జూలై 27: ముద్రగడ పద్మనాభం రెండో రోజైన గురువారం కూడా గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ప్రసారమవుతున్న వార్తల్లో వాస్తవం లేదని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆయన ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు. అలాగే ఎవరైనా ఆయనను ఇంటికి వెళ్లి కలువచ్చన్నారు.

07/28/2017 - 02:40

విజయవాడ, జూలై 27: రాష్ట్ర వ్యాప్తంగా మీజిల్స్ (తట్టు), రూబెల్లా నివారణకు ఎంఆర్ టీకా కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ వెల్లడించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో తట్టు, రుబెల్లా టీకా కార్యక్రమంపై ఆయన అధ్యక్షతన రాష్టస్థ్రాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.

07/28/2017 - 02:38

రాజమహేంద్రవరం, జూలై 27: మనుషులకు మాదిరే ఇక ఆవులకూ, పాడి పశువులకూ ఆధార్ నెంబర్లు తీసుకోవాల్సిందే.. పశు సంజీవని పేరుతో పశు సంవర్ధక శాఖలో ఒక వినూత్న పథకం మొదలైంది. ఈ పథకం తూర్పుగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆరంభమైంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పాడి పశువుల బేరసారాలు చేసుకోవచ్చు. అంతర్జాలంలోనే సంతలు నిర్వహించుకుని, ఫొటోల ద్వారా కావాల్సిన పశువులను కొనుగోలు చేసుకోవచ్చు. అమ్మకాలు సాగించవచ్చు.

07/28/2017 - 02:34

విజయవాడ, జూలై 27: పాదయాత్ర చేయదల్చుకున్నవారు చట్టపరంగా అనుమతులు పొందాల్సిందేనని, ఇందుకు ఎవరూ అతీతులు కాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం రాజ్యాంగానికి అతీతులు కాదని, ఆయన కూడా అనుమతి పొందాల్సిందేనని అన్నారు.

07/28/2017 - 02:33

పలాస, జూలై 27: ఒడిశాలోని మహేంద్రగిరుల కొండల నుంచి దారి తప్పి మైదాన ప్రాంతమైన ఆంధ్రాలోకి ప్రవేశించిన గజరాజులు నెల రోజులవుతున్నా అటవీశాఖాధికారులు స్పందించడం లేదు. ఇప్పుడా గజరాజులు పంట పొలాలు, ప్రజల ఆస్తిని నష్టపరుస్తున్నాయి. ఏనుగుల సంచారంతో కంటిమీద కునుకు కరవైన ప్రజలను కాపాడాల్సిన అటవీశాఖాధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

07/28/2017 - 02:33

భీమవరం, జూలై 27: రాష్ట్రంలోని నగరాలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు పచ్చదనం సంతరించుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపి పట్టణ సుందరీకరణ ప్రాజెక్టు లిమిటెడ్ (ఎపియుజిబిసిఎల్)ను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లో నాటడానికి సుమారు 10 రకాల మొక్కలను గుర్తించారు. వీటిలో నీడనిచ్చేవి, పూలు, ఫలాలను ఇచ్చేవి ఉన్నాయి. రోడ్లవెంబడి ఎవెన్యూ రకాల మొక్కలను ఏర్పాటుచేస్తారు.

07/28/2017 - 02:32

న్యూఢిల్లీ, జూలై 27: ఆంధ్రాలో ఒక్క స్కూలును కూడా మూయలేదని రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించిందని మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు.

Pages