S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/28/2017 - 02:31

విజయవాడ, జూలై 27: ఎన్టీఆర్ వైద్యసేవకు సంబంధించి హైదరాబాద్‌లో గుండె చికిత్సలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణకు చెందిన పలువురు హృద్రోగ నిపుణులు విజ్ఞప్తి చేశారు.

07/27/2017 - 02:31

విజయవాడ, జూలై 26: శాసనసభ పబ్లిక్ అక్కౌంట్స్, ఎస్టిమేట్స్, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర లెజిస్లేచర్ స్పెషల్ సెక్రటరీ రామాచార్యులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభ్యులుగా ఉంటారు.

07/27/2017 - 02:31

అమరావతి, జూలై 26: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమని ఆయన చెప్పారు. తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గించుకుండానే ఆంగ్లంలో బోధిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

07/27/2017 - 02:30

విజయవాడ, జూలై 26: భారతీయ క్షిపణి శాస్తవ్రేత్త, మాజీ రాష్టప్రతి డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం నిత్య స్ఫూర్తిదాత, మార్గదర్శకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. జూలై 27న కలాం వర్ధంతి సందర్భాన ఆయనతో తన అనుభవాలను ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకున్నారు.

07/25/2017 - 03:10

అమరావతి, జల్రై 24: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు డాక్టర్ కంభంపాటి హరిబాబును కేంద్రమంత్రి పదవి వరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం.. ఉప రాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయుడు వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబుకు, త్వరలో జరగనున్న కేంద్ర క్యాబినెట్ విస్తరణలో కేంద్ర సహాయమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

07/25/2017 - 03:08

విజయవాడ, జూలై 24: ప్రపంచంలోనే మొదటగా వర్చువల్ డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ పాఠశాలల్లో నాంది పలికామని, రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

07/25/2017 - 03:07

న్యూఢిల్లీ,జూలై 24:ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 2,25,245 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో ఆమోదం తెలిపారు. ఆంధ్రాతో సహా దేశంలోని పలు రాష్ట్రాలకు ఇళ్ల మంజూరు దస్త్రంపై వెంకయ్యనాయుడు చివరి సంతకం చేశారు.

07/25/2017 - 03:07

అమరావతి, జూలై 24: ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి, అందరికీ నమూనాగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి’ ఈ వారం పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం స్వయం పోషకం కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

07/25/2017 - 03:06

విజయవాడ, జూలై 24: గత సంవత్సరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్(ఎన్‌సిఎఇఆర్) రిపోర్టు ఇచ్చినప్పుడు ఇదే ‘ప్రతిపక్ష’ నాయకుడు జగన్ రాష్ట్రం వెనుకబడిపోతోందంటూ గగ్గోలు పెట్టారు.. రాష్ట్రం విభజన జరిగిన కొత్తలో పాత లెక్కల ఆధారంగా ఇచ్చిన రిపోర్టుపై గందరగోళం సృష్టించారు.. తాజాగా ఇదే సంస్థ ఇచ్చిన సర్వేలో ఏపీ దేశంలోనే గుజరాత్, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో నిలిచిందని చెప్పింది..

07/25/2017 - 03:06

విజయవాడ, జూలై 24: రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో త్వరలో పామోలిన్, పంచదార, కందిపప్పులను ఒక ప్యాకేజీగా ఏర్పాటుచేసి వినియోగదారులకు అందించేందుకు చూస్తున్నామని పౌర సరఫరాలు, ధరల నియంత్రణ, వినియోగదారుల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.

Pages