S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/25/2017 - 01:33

హైదరాబాద్, జూలై 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కారణంగా నిరాశ్రయులవుతున్న వారి సంగతి ఏమిటని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రజావాజ్య పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్, జస్టిస్ టి రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది.

07/25/2017 - 01:33

ఏలూరు, జూలై 24 : ఒక ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులపై రోడ్డు పక్కన వున్న చెట్టు వేళ్లతో సహా ఒక్కసారిగా పడిపోవడంతో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మానుకొండ డేవిడ్‌రాజు ఆయన భార్య భాగ్యం (42) ద్విచక్ర వాహనంపై సోమవారం వీరిశెట్టిగూడెం నుంచి ఉప్పలపాడు గ్రామానికి వెళుతున్నారు.

07/25/2017 - 01:32

విజయవాడ, జూలై 24: రాష్ట్రంలో 200 కేంద్రాల్లో అన్న క్యాంటీన్లను అక్టోబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో అన్న క్యాంటీన్ల ఏర్పాట్లపై సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ నంద్యాల పట్టణం సహా, 14 నగర పాలక సంస్థలు, 2 జిల్లా కేంద్రాల్లో తొలివిడతగా అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

07/25/2017 - 01:32

విజయవాడ, జూలై 24: దేశంలో మీజిల్స్ (తట్టు, తడపర), రుబెల్లా వ్యాధుల నివారణే లక్ష్యంగా రాష్ట్రంలోని పిల్లలందరికీ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఎంఆర్ టీకా (మీజిల్స్, రుబెలా) వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. 9 నెలల వయస్సు నుంచి 15 ఏళ్లు వచ్చిన పిల్లలందరికీ ఈ టీకా వేయనున్నామన్నారు.

07/25/2017 - 01:31

కాకినాడ సిటీ, జూలై 24: మావోయిస్టు దళంలో అత్యంత కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఎసిఎం స్థాయి దళ కమాండర్ మాసను అరెస్టుచేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఎటపాక సమీపంలో సోమవారం ఉదయం మాసను అరెస్టుచేశామన్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కాకినాడలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను తెలిపారు.

07/25/2017 - 01:29

విజయపురి సౌత్, జూలై 24: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 6 గంటలకు నాలుగో గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున పెంచుతూ రాత్రి 9 గంటలకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

07/24/2017 - 02:18

అమరావతి, జూలై 23: సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఆయన తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలున్నట్టు కిరణ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

07/24/2017 - 02:17

కదిరి, జూలై 23 : రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులను పూర్తిగా నియంత్రిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ స్పష్టం చేశారు. అలాగే షాపుల్లో ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి జవహార్ ఆదివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఆర్‌అండ్‌బి బంగ్లాలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/24/2017 - 02:09

కర్నూలు, జూలై 23 : కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులంతా బాధ్యతగా పని చేయాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. సిఎం చంద్రబాబు శనివారం నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రాత్రి స్థానిక అతిథి గృహంలో బస చేసి పొద్దు పోయే వరకూ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు.

07/24/2017 - 02:02

విజయవాడ, జూలై 23: రాష్ట్రంలో దళితులపై వివిధ రూపాల్లో దాడులు తీవ్రవౌతున్నాయని, వీటిని అధికార పార్టీ కప్పిపుచ్చుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య, దడాల సుబ్బారావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో సామాజిక బహిష్కరణ ఇంకా కొనసాగుతోందని అన్నారు.

Pages