S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/24/2017 - 02:01

విజయవాడ, జూలై 23: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం ప్రజలందరిదీనని, గర్వకారణమైన ఈ నగరాభివృద్ధి భవిష్యత్తులో పాఠ్యాంశంగా రూపుదిద్దుకుంటుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధిపై ఆయన ఆదివారం సిఆర్‌డిఏ, ఇంధన శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు.

07/24/2017 - 01:58

విజయవాడ, జూలై 23: పరిశ్రమలు, దుకాణాలు, మోటార్ వాహనాల్లో పనిచేసే కార్మికులు, సిబ్బంది సంక్షేమం కోసం అమల్లో ఉన్న ఏ చట్టం కూడా సక్రమంగా అమలుకు నోచుకోవటం లేదు. దీంతో ఆయా రంగాల్లో కార్మికులు తమకందాల్సిన అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు.

07/24/2017 - 01:56

విజయవాడ, జూలై 23: పాఠశాల స్థాయి విద్యార్థుల బ్యాగ్‌ల బరువుపై పరిమితి విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టంలో పొందుపరిచినప్పటికీ, దాని అమలుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బ్యాగ్‌ల బరువుపై స్పందించాల్సిన ప్రభుత్వం పట్టనట్లుగా ఉంటోంది. పాఠశాలల స్కూల్ బ్యాగ్‌ల బరువుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2006లోనే ఓ చట్టం తెచ్చింది.

07/24/2017 - 01:50

హైదరాబాద్, జూలై 23: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల ఆగస్టు 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఐదు రోజుల పాటు 15 జిల్లాల్లో జిల్లాకు ఒక గ్రామంలో బహిరంగ విచారణను నిర్వహించనున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే పర్యావరణ పరమైన అనుమతులు తప్పనిసరి.

07/24/2017 - 01:12

హైదరాబాద్, జూలై 23: ‘సర్.. మీకు క్రెడిట్ కార్డు కావాలా..మా మొబైల్ కంపెనీ అందిస్తున్న అద్భుతమైన డేటా ప్యాకేజి కావాలా.. తక్కువ వడ్డీకే స్పాట్‌లోనే లోన్ ఇస్తాం..మా సంస్థలో చేరి అద్భుతమైన ఆరోగ్య, జీవిత బీమా పాలసీ తీసుకుంటారా..’ అంటూ రోజుకి ఒకటి రెండు సార్లు అయినా విసుగెత్తించే ఫోన్ కాల్స్ బారిన పడని వారెవరూ ఉండరు.

07/24/2017 - 01:09

కడప, జూలై 23 : పలు అవినీతి ఆరోపణలపై కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీఓ) వినాయకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆర్డీఓ వ్యవహారంపై ప్రభుత్వానికి కూడా సమాచారం ఇస్తానని మంత్రి స్పష్టం చేశారు.

07/24/2017 - 00:30

ఒంగోలు, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం బిసిలను, కాపులను రెండు కళ్లుగా భావిస్తోందని, బిసిలకు ఎలాంటి నష్టం కలుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామానుజయ వెల్లడించారు. ఆదివారం ఒంగోలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

07/24/2017 - 00:29

నెల్లూరు, జూలై 23: జిల్లాలో అమలవుతున్న పలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో జరుగుతున్న అవినీతిపై ఆదివారం జరిగిన నెల్లూరు జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికార, విపక్ష సభ్యులు పరస్పర వాగ్వాదాలకు దిగారు. ఇటీవల జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాల ద్వారా భారీ కుంభకోణానికి కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారపక్ష నేతలు పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

07/24/2017 - 00:29

రాజమహేంద్రవరం, జూలై 23: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని, లేదంటే పురుషోత్తపట్నం వచ్చే ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని సిపిఎం మాజీ ఎంపి మిడియం బాబూరావు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/24/2017 - 00:28

విజయవాడ, జూలై 23: ఎన్నికల కోసమే నంద్యాలను అభివృద్ధి చేయడం లేదని, రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసమన్నట్లు చంద్రబాబు వాలకం ఉందన్నారు.

Pages