S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/21/2017 - 03:12

చిత్తూరు, జూలై 20: రాష్ట్రంలో 28ప్రధాన ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేయడంతో పాటు రానున్న కాలంలో కుప్పంకు హంద్రీ-నీవా ద్వారా నీటిని తీసుకు రావడం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో రెండురోజుల పర్యటనలో భాగంగా గురువారం గుడుపల్లె వచ్చారు. ఈ సందర్భంగా మండల పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

07/21/2017 - 03:09

విజయవాడ, జూలై 20: కేరళ రాష్ట్రానికి త్వరలో రాష్ట్రం నుంచి జయ రకం బియ్యం సరఫరా కానున్నాయి. రేటు విషయంలో స్పష్టత వస్తే, సెప్టెంబర్‌లో జరిగే ఓనం పండుగ నాటికి ఈ బియ్యం సరఫరా చేయాలని కేరళ ప్రభుత్వం కోరుతోంది. కేరళలో సాగు భూమి విస్తీర్ణం తక్కువగా ఉండటంతో వరిపంట సాగు తక్కువగానే ఉంటుంది. దీంతో కేరళలో డిమాండ్ ఎక్కువగా ఉన్న జయ, మట్ట రకం బియ్యం కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది.

07/21/2017 - 03:07

విజయవాడ, జూలై 20: సామాన్య ప్రేక్షకుడికి భారం కాని రీతిలో సినిమా టిక్కెట్ల ధరల పెంపు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సూచించారు. దేశ వ్యాప్తంగా ఏకీకృత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ సినిమా ధియేటర్లలో టిక్కెట్ ధరల పెంపు అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులతో కూడిన కమిటీతో గురువారం సమీక్షించారు.

07/21/2017 - 03:06

కాకినాడ, జూలై 20: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జంతు హింస నివారణ సంఘం (ఎస్‌పిసిఎ)లో ఆవుల మరణాలు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో సుమారు 40 గోవులు మృత్యువాత పడ్డాయి. ఒక్క గురువారం నాడే ఈ గోశాలలో 10 గోవులు మృతి చెందాయి. దీంతో గోసంరక్షకులు, జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

07/21/2017 - 01:53

గుంటూరు, జూలై 20: రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎండిగా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం పద్మను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2004 ఐఎఎస్ కేడర్‌కు చెందిన పద్మ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
బివి బాలయోగి,
ఇ రవీంద్రబాబులకు పదోన్నతి

07/21/2017 - 01:52

విజయవాడ (క్రైం), జూలై 20: రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రత్యేక ఏసిబి న్యాయస్థానాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు తదితర చోట్ల నూతనంగా నాలుగు ప్రత్యేక ఏసిబి కోర్టులో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

07/21/2017 - 01:51

హైదరాబాద్, జూలై 20: జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. తనపై దాఖలు చేసిన కేసులన్నింటినీ కలిపి విచారించాలన్న వైకాపా అధ్యక్షుడు జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థల పిటిషన్‌ను సిబిఐ కోర్టు గతంలో తిరస్కరించింది. సిబిఐ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ జగన్ సంస్థలు హైకోర్టులో పిటిషన్‌ను గతంలో దాఖలు చేశాయి. కాగా గురువారం హైకోర్టులో తన పిటిషన్‌ను జగన్ సంస్థలు ఉపసంహరించుకున్నాయి.

07/21/2017 - 01:51

విశాఖపట్నం (జగదాంబ), జూలై 20 : ఫార్మా కంపెనీల్లో భద్రతాప్రమాణాలు, ఆడిటింగ్‌పై ‘్థర్డ్‌పార్టి’ ఏంక్వైరీ ఏర్పాటు చేస్తున్నట్టు కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారయణ పేర్కొన్నారు.

07/21/2017 - 01:50

తిరుపతి, జూలై 20: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో గురువారం తుడా (తిరుపతి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ) ప్రణాళిక విభాగంలో పనిచేసే కృష్ణారెడ్డిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఆయన ఇంటిపై, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు.

07/21/2017 - 01:50

న్యూఢిల్లీ, జూలై 20: ప్రకాశం జిల్లా దేవరపల్లి గ్రామంలో దళితుల భూములపై రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పుతోందంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కఠారియాకు వైఎస్సాఆర్‌సిపి ఎంపీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు.

Pages