S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/18/2017 - 02:49

ఏలూరు, జూలై 17: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికార్లు సోదాలు నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు రూ.13 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఆస్తులను గుర్తించారు.

07/18/2017 - 02:47

అమరావతి, జూలై 17: వర్షాకాలంలో నీరు దాచుకునే విధానాలను అనుసరించకపోతే ఎంత భారీ వర్షాలు కురిసినా వృథాయేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికపైన వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలన్నారు. సోమవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు సమీక్షా సమావేశంతో పాటుగా ‘నీరు- ప్రగతి’పై అధికారులతో వీడియో, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/18/2017 - 02:46

విజయవాడ, జూలై 17: రాష్ట్రంలోని పంచాయతీల్లో ఇక ఎల్‌ఇడి బల్బులను వినియోగించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ, ఇఎస్‌ఎస్‌ఎల్ మధ్య సోమవారం ఒప్పందం జరిగింది. తొలిదశలో తొమ్మిది జిల్లాల్లోని పంచాయితీల్లో ఎల్‌ఇడి బల్బులు అమర్చేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నారు.

07/18/2017 - 02:46

విశాఖపట్నం, జూలై 17: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. ఇది మంగళవారం నాటికి వాయుగుండగా మారనుంది. దీని ప్రభావం వలన వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది.

07/18/2017 - 02:44

శ్రీకాకుళం, జూలై 17: మూడు రోజులుగా ఒడిశా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నదికి పోటెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే వంశధారకు వరద నీటి ప్రవాహం పెరిగింది. మరో రెండు రోజులు ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కుట్రగడలో 8.54 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

07/18/2017 - 02:22

న్యూఢిల్లీ, జూలై 17: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సోమవారం వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అచల్ కుమార్ జ్యోతిని కలిశారు.

07/18/2017 - 02:21

ఒంగోలు, జూలై 17: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల వలన దేశానికి , సామాన్యులకు పెద్దగా ప్రయోజనం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. సోమవారం ఒంగోలులోని సిపిఐ జిల్లా కార్యాలయంలోని సమావేశ మందిరంలో సిపిఐ రాష్టస్రమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

07/18/2017 - 02:20

విశాఖపట్నం, జూలై 17: విశాఖ భూ కుంభకోణంలో మరో అతి పెద్ద అవినీతి వెలుగు చూసింది. మెడ్‌టెక్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని సేకరించిన ప్రభుత్వం అందులో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన లబ్ధిదారులకు దాదాపు 24 కోట్ల రూపాయలు చెల్లించిన వైనమిది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులే ఎక్కువ మంది ఉండడం గమనార్హం.

07/18/2017 - 02:19

విశాఖపట్నం (క్రైం), జూలై 17: విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బీచ్ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ మార్వాడీ కుటుంబంపై ఆరుగురు దుండగులు కత్తులు, తుపాకులతో దాడి చేసిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాలు ప్రకారం- బీచ్ రోడ్డులోని సీ సర్ఫ్ అపార్ట్‌మెంట్‌లోని ఆరవ ఫ్లోర్‌లో విక్రమ్ కుటుంబం నివాసం ఉంటోంది.

07/18/2017 - 02:18

హైదరాబాద్, జూలై 17: సదావర్తిసత్రం భూములకు సంబంధించి మరింత పెద్ద మొత్తంలో ఎవరైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉంటే చూడాలని హైకోర్టు పేర్కొంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్, జస్టిస్ టి రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

Pages