S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/18/2017 - 02:18

హైదరాబాద్, జూలై 17: ఎయిర్‌లైన్స్ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తామని జెసి దివాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

07/18/2017 - 02:17

రాజమహేంద్రవరం, జూలై 17: ‘పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణాలోకి పరవళ్ళు తొక్కుతున్నాయి..పట్టిసీమ వల్ల ఈ ఏడాది కృష్ణా ఆయకట్టులో ముందస్తు ఖరీఫ్ సాధ్యపడింది..పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణాకు తోడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి దాదాపు రూ.7500 కోట్ల విలువైన పంటల ఆదాయం సాధించాం... ఇంత ప్రయోజనం కలిగిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఆరోపణలు తగదు’ ఇది అధికార పక్షం ప్రజా ప్రతినిధుల వాదన.

07/18/2017 - 00:46

అమరావతి, జూలై 17: ఇకపై పర్యాటక శాఖ సమీకరించే బహుమతి ప్రతిమలు, జ్ఞాపికలను కేవలం లేపాక్షి సంస్థ నుండి మాత్రమే తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నిర్ణయించారు. సోమవారం ఎపిటిడిసి ఎండి హిమాన్షు శుక్లాతో కలిసి ప్రభుత్వ పరంగా అందించవలసిన జ్ఞాపికలు ఎలా ఉండాలన్న దానిపై మీనా చర్చించారు.

07/18/2017 - 00:46

అమరావతి, జూలై 17: వాళ్లు చట్టాలు చేసే సభలో గౌరవనీయ సభ్యులు. కానీ ఓటు వేయడం కూడా తెలియలేదు. పైగా ఓటు ఎలా వేయాలో ఆపసోపాలు పడి చెప్పినా వారి చెవికెక్కలేదు. ఫలితంగా రెండు అమూల్యమైన ఓట్లు చెల్లకుండా పోయాయి. రాష్టప్రతి ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యుల తీరిది.

07/18/2017 - 00:46

విజయవాడ, జూలై 17: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మరో కొద్ది రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా పర్యటనలో భాగంగా సిఎం చంద్రబాబునాయుడు అక్కడ ఎలక్ట్రికల్ బస్సులను పరిశీలించి, అమరావతిలోనూ వాటి నిర్వహణ సాధ్యసాధ్యాలపై పరిశీలన చేయమన్నారన్నారు.

07/18/2017 - 00:45

విజయవాడ, జూలై 17: రాష్టప్రతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

07/18/2017 - 00:45

విజయవాడ, జూలై 17: నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఉప రాష్టప్రతిగా వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వం ఖరారు చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆయన అభినందనలు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సిఎం మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే పోరాట యోధుడిగా ఉన్నారన్నారు.

07/18/2017 - 00:44

విజయవాడ, జూలై 17: నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను ఈ ఎన్నికకు ఇన్‌చార్జులుగా నియమించారు. రాష్టప్రతి ఎన్నిక సందర్భంగా ఓటింగ్ తరువాత సచివాలయంలో ఎమ్మెల్యేలతో సిఎం సమావేశమయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక అనుసరించాల్సిన వ్యూహంపై దాదాపు గంట సేపు చర్చించారు.

07/18/2017 - 00:43

విజయవాడ, జూలై 17: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి జవహర్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో సోమవారం తెలంగాణలో ఇటీవల మాదక ద్రవ్యాలకు సంబంధించి వెలుగుచూస్తున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో వీటి నిరోధంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ మేరకు త్వరలో ఒక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనున్నామన్నారు.

07/18/2017 - 00:43

విజయవాడ, జూలై 17: పాదయాత్ర చేసేందుకు కాపు నేత ముద్రగడ పద్మనాభం అనుమతి తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ పాదయాత్రకు ఇంకా ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని, అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదన్నారు.

Pages