S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/18/2017 - 00:42

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 17: రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న ఏడు స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశానికి ఈనెల 19న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు డిఎస్‌డివో బి.శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న ఈ అకాడమీల్లో ప్రవేశానికి అర్హులైన ఆసక్తిగల క్రీడాకారులు హాజరుకావాలని కోరారు.

07/18/2017 - 00:42

అమరావతి, జూలై 17: భారత ఉప రాష్టప్రతి అభ్యర్థిగా బిజెపి సీనియర్ నేత, కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎంపిక కావడంతో ఆయన స్వరాష్ట్రంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగిన వెంకయ్య ఇమేజ్, ఇప్పుడు మరింత పెరిగిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే మిత్రపక్షమైన టిడిపిలో మాత్రం ఆయన ఎంపిక నిరాశ నింపింది.

07/18/2017 - 00:41

అమరావతి, జూలై 17: వరద వచ్చినా నష్టం జరగని లెవల్ వరకు కాంక్రీట్ పనులు పూర్తిచేయాలని, ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. ఈ వారంలో 19,266 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయని, ఈ నెలాఖరులోగా లక్ష క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తిచేయాలని చెప్పారు.

07/17/2017 - 04:14

అమరావతి, జూలై 16: రాష్టప్రతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకూ వెలగపూడిలోని శాసనసభ కమిటీ హాల్‌లో జరిగే ఎన్నిక నిర్వహణ ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల పరిశీలకురాలు కౌర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

07/17/2017 - 02:49

ఒంగోలు, జూలై 16: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి దళితులను ఆదివారం పరామర్శించడానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురిని శనివారం అర్ధరాత్రి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో బాలినేని అనుచరులు ఆయన నివాసానికి పెద్దఎత్తున చేరుకుని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

07/17/2017 - 02:48

ఆత్మకూరు, జూలై 16: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుతో పాటు పలువురిపై మహారాష్టక్రు చెందిన నాగపూర్ ఏసిబి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆదివారం ఒక్కసారిగా గుప్పుమన్న ఈ నేరారోపణలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

07/17/2017 - 02:46

భీమవరం, జూలై 16: విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారికి భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుండి ఆదివారం చీర, సారె పంపించారు. ఆషాఢమాసం సాంప్రదాయాన్ని పాటిస్తూ పసుపు, కుంకుమ, చీర, గాజులు, 11 రకాల మిఠాయిలను పంపించారు.

07/17/2017 - 02:44

తెనాలి, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో ఆగస్టు 1 నుండి 450 కోట్ల రూపాయల నిధులతో ‘బాలామృతం’ పథకం రాష్టవ్య్రాప్తంగా అమలు చేయనుందని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని బాలలకు పౌష్ఠికాహారం అందించి వారి ఆరోగ్యమే ధ్యేయంగా ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు.

07/17/2017 - 02:44

కర్నూలు, జూలై 16 : తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమని, ఎట్టి పరిస్థితుల్లో వైకాపాను వీడే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపి బుట్టా రేణుక ఆదివారం స్పష్టం చేశారు.

07/17/2017 - 02:43

కర్నూలు, జూలై 16 : కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికలో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు మహిళలతో ప్రచారం చేయించడానికి వ్యూహం రచిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా టిడిపి, వైకాపా పని చేస్తూ నియోజకవర్గంలో ఓటర్ల సానుభూతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

Pages