S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/16/2017 - 04:08

లింగపాలెం, జూలై 15: పశ్చిమగోదావరి జిల్లా మండల కేంద్రం లింగపాలెం గ్రామ శివారులో శనివారం జరిగిన మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో చింతలపూడి ఎస్సై బాణావతు సైదానాయక్ (33), భార్య శాంతి (31)లు మృతిచెందారు. చింతలపూడి నుంచి ఏలూరు కారులో ప్రయాణిస్తుండగా లింగపాలెం వద్ద కారు చెట్టును ఢీకొనడంతో వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు.

07/16/2017 - 04:06

రాజమహేంద్రవరం, జూలై 15: పోలవరం స్పిల్ వే కాంక్రీటు బీటలు వారిందని, నాణ్యతా లోపమే ఇందుకు కారణమని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే సెకన్లలో కోట్ల క్యూసెక్కుల జలాలు ఈ ప్రాంతాన్ని ముంచేస్తాయని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

07/16/2017 - 03:45

విజయవాడ, జూలై 15: రాష్ట్రంలో ఐటిఐ చదివిన లక్ష మందికి శిక్షణను అందించి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్‌టిఆర్ యూనివర్సిటీ సమీపంలోని పరిణయ ఫంక్షన్ హాలులో కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

07/16/2017 - 03:43

విజయవాడ (క్రైం), జూలై 15: లైంగిక వేధింపుల నుంచి బాలలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, రక్షణ చట్టాలు అమలుపై నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన రాష్టస్థ్రాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కీలకోపన్యాసం చేశారు.

07/16/2017 - 03:01

నెల్లూరురూరల్, జూలై 15: సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి సహకరించవలసిన పోలీసులే అసాంఘిక కార్యక్రమాల్లో భాగస్వాములుగా నిలుస్తూ జైలుకు వెళ్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎదురైంది. నెల్లూరు శివారు ఇరుకళలమ్మ సంఘం సమీపాన రాజీవ్ గృహ సముదాయంలో శుక్రవారం అర్ధరాత్రి పేకాట జోరుగా సాగుతోందని సమాచారం అందుకున్న రూర ల్ పోలీసులు పేకాట స్థావరంపై దాడిచేశారు.

07/16/2017 - 03:00

చంద్రగిరి, జూలై 15: ప్రస్తుతం సమాజంలో యువత ఇంజనీరింగ్ ఎంబిబిఎస్, వాటితోపాటు సైన్స్‌పట్ల మొగ్గుచూపితే మంచి భవిష్యత్ ఉంటుందని, దేశానికి సేవ చేయవచ్చని ఇస్త్రో చైర్మన్ డాక్టర్ ఎ.ఎన్ కిరణ్‌కుమార్ అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో 6వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

07/16/2017 - 03:00

కాకినాడ, జూలై 15: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రాష్ట్రంలో సుమారు 14 లక్షల కోట్ల పెట్టుబడులతో రెండు దఫాలుగా పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.

07/16/2017 - 02:57

విజయవాడ, జూలై 15: రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పద్మభూషణ్ డాక్టర్ కెఎల్ రావు పాత్ర ఎంతో ఉందని అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ కెఎల్ రావు 115వ జయంతి వేడుకలు నిర్వహించారు.

07/16/2017 - 02:55

మచిలీపట్నం, జూలై 15: కృష్ణా జిల్లా బందరు సముద్ర తీరానికి దక్షిణాన 100 కిలోమీటర్ల దూరంలో చనిపోయిన ఓ భారీ తిమింగలం గిలకలదిండి మత్స్యకారుల వలకు చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన కొందరు గిలకలదిండి మత్స్యకారులు నెల్లూరు సరిహద్దుల్లో వేటాడుతుండగా మూడురోజుల క్రితం సముద్రంలో తేలుతున్న ఓ భారీ తిమింగలం కంటపడింది.

07/16/2017 - 02:53

విజయనగరం, జూలై 15: కేంద్ర ఉపాధి హామీ మండలి (సెంట్రల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ కౌన్సిల్) సలహా సభ్యురాలిగా ఇక్కడి జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి నియమితులయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కౌన్సిల్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో జెడ్పీ చైర్మన్ల విభాగంలో దేశంలో ఈమె ఒక్కరికే ఈ అవకాశం దక్కింది.

Pages