S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/16/2017 - 02:52

రంపచోడవరం, జూలై 15: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గిరిజనుడు నాటు తుపాకీ పేలి శనివారం మృతి చెందాడు. రంపచోడవరం ఎస్సై విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం పోతు భద్రందొర (35) అనే గిరిజనుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నర్సాపురం గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి శుక్రవారం రాత్రి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు.

07/16/2017 - 02:50

విజయవాడ, జూలై 15: వెనుకబడిన తరగతుల కమిషన్‌కు కాపు రిజర్వేషన్ల అంశంపై వివిధ శాఖల నుంచి ఇవ్వవలసిన సమాచారంపై ఇప్పటికే రెండుసార్లు సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయం త్రం విజయవాడ క్యాంప్ ఆఫీసులో సంబంధిత అధికారులతో మరోమారు సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల నుంచి ఇవ్వవలసిన సమాచారం కమిషన్‌కు అందజేశామని ఉన్నతాధికారులు ఆయనకు తెలిపారు.

07/16/2017 - 02:49

కర్నూలు, జూలై 15: కర్నూలుకు చెందిన తూనికలు కొలతల శాఖ అధికారి స్వామి లంచం తీసుకుంటూ శనివారం ఎసిబి అధికారులకు చిక్కారు. వేబ్రిడ్జి అనుమతి రెన్యూవల్ కోసం ఆళ్లగడ్డకు చెందిన దాని యజమాని రామలింగయ్య నుంచి రూ.30 వేలు లంచం తీసుకున్న తూనికల, కొలతలశాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ ఎన్.స్వామిని అరెస్టుచేసినట్లు ఎసిబి డిఎస్పీ జయరామరాజు తెలిపారు.

07/16/2017 - 00:54

విశాఖపట్నం, జూలై 15: విశాఖలోని ఒక ప్రైవేటు కళాశాలలో శనివారం జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. కంప్యూటర్లలో పరీక్షలకు సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కాకపోవడంతో పరీక్షకు ఆటంకం ఏర్పడింది. దీంతో విద్యార్థులు పరీక్ష వాయిదా వేయాలంటూ నిరసనకు దిగారు.

07/16/2017 - 00:54

విశాఖపట్నం, జూలై 15: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం ఉదయానికి అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

07/16/2017 - 00:53

కర్నూలు, జూలై 15: కర్నూలు జిల్లా వైకాపాలో ఎంపి బుట్టా రేణుక తీరు కలకలం రేపింది. కర్నూలు ఎంపి బుట్టా రేణుకమ్మ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలవడం పార్టీలో మరో వివాదానికి దారి తీసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధినేత జగన్ రేణుకను మందరించినట్లు సమాచారం.

07/16/2017 - 00:53

ఒంగోలు,జూలై 15:పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలనే సదుద్దేశ్యంతో అన్న అమృతహస్తం పథకాన్ని రాష్ట్రంలో అమలుచేస్తున్నామని, ఈపథకంలో సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేసేందుకైనా వెనకాడే ప్రశక్తేలేదని రాష్ట్ర స్ర్తి,శిశుసంక్షేమశాఖమంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. శనివారం మద్దిపాడు, ఒంగోలు మండలాల్లో ఆమె పర్యటించి అంగన్‌వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు.

07/16/2017 - 00:52

రాజమహేంద్రవరం, జూలై 15: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆకలి పోరాటం.. ఆఖరి పోరాటం కాదు.. ఆయనకు ఎప్పుడూ పోరాటమేనని రాష్ట్ర డిప్యూటి సిఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ముద్రగడ పద్మనాభం కాపు యువతను రెచ్చగొడుతున్నారని, కాపు యువత అప్రమత్తంగా ఉండాలని, సంయమనం పాటించకపోతే ఆయన మాటలు విని కేసుల్లో ఇరుక్కుంటారని, యువత అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి రాజప్ప అన్నారు.

07/16/2017 - 00:44

విజయవాడ (క్రైం), జూలై 15: స్కూలు పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారనే అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే సినిమా పరిశ్రమను టార్గెట్ చేశారని ప్రముఖ నిర్మాత అశోక్‌కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈసందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వాడకం మొదలైందని తెలిపారు.

07/16/2017 - 00:44

విజయవాడ, జూలై 15: బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్లలో రాష్ట్రంలోని బ్రాహ్మణులను ఓటుబ్యాంకుగా చూసిన తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని శనివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు.

Pages