S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/04/2017 - 02:06

రాజమహేంద్రవరం, జూలై 3: చెన్నైలో ఆంధ్రా పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నేత కాకరాల పద్మను తక్షణం కోర్టులో ప్రవేశ పెట్టాలని ఎపిసిఎల్‌సి రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు డిమాండ్ చేశారు. పద్మ ఏవైనా నేరాలు చేసివుంటే కోర్టులో ప్రవేశపెట్టాలని, ఆమె ప్రాణానికి హాని వుందని చిట్టిబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

07/04/2017 - 00:28

విజయవాడ, జూలై 3: గ్రూప్-2 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎపిపిఎస్‌సి చివరి అవకాశం కల్పించింది. జోన్, జిల్లా, కుల వివరాల్లో తప్పులను సరి చేసేందుకు గడువు ఇచ్చారు. ఈ నెల 15లోగా తప్పులు సరిచేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని, మరో అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

07/04/2017 - 00:28

విజయవాడ, జూలై 3: సదావర్తి సత్రం భూములపై తాము ఏనాడో సవాల్ చేశామని రాష్ట్ర మంత్రి లోకేష్ తెలిపారు. ఎకరాకు 5 కోట్లు ఎక్కువ ఇస్తే, భూములు ఇచ్చేస్తామని ప్రకటించామని, ఇప్పుడు కోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని తెలిపారు. డబ్బులు లేవంటూ సమయం అడిగారని, కోర్టులో డబ్బులు కడితే మంచిదే కదా? అని వ్యాఖ్యానించారు.

07/04/2017 - 00:28

విజయవాడ, జూలై 3: రాష్ట్రంలోని వివిధ పాఠశాల భవనాల దుస్థితిపై వస్తున్న కథనాలపై విచారణకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. పాఠశాల భవనాల నిర్వహణకు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంకా పెచ్చులూడే స్థితిలో భవనాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై నివేదిక అందించాలని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

07/04/2017 - 00:27

విజయవాడ, జూలై 3: ఇతర కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినట్లుగానే రూ.1000 కోట్లతో చేనేత కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో చేనేత ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేసింది.

07/04/2017 - 00:27

విజయవాడ, జూలై 3: మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టడం సరికాదన్న అభిప్రాయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై మద్యం దుకాణాల యజమానులు ఆలోచించాలన్నారు. సదావర్తి భూములపై కోర్టు తీర్పును స్వాగితిస్తున్నామన్నారు.

07/04/2017 - 00:26

విజయవాడ (క్రైం), జూలై 3: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగంపై విచారించేందుకు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం చీఫ్ ఇంజనీర్ పాము పాండురంగారావును అవినీతి నిరోధక శాఖ తమ కస్టడీకి తీసుకుంది. ఈ కేసులో వివరాలు రాబట్టేందుకు పాండురంగారావును విచారించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని ఏసిబి అధికారులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

07/04/2017 - 00:26

విజయవాడ, జూలై 3: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తరతరాల స్ఫూర్తిదాత అని, రంపపోరుతో వలసపాలకులపై తదుపరి పోరాటాలకు మార్గదర్శనం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి స్ఫూర్తిని ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకున్నారు.

07/04/2017 - 00:25

విజయవాడ, జూలై 3: మద్యం నూతన పాలసీ అమల్లోకి వచ్చిన మూడో రోజైన సోమవారం నాటికి రాష్ట్రంలో దాదాపు 50 శాతానికి పైగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం తక్కువ సంఖ్యలోనే తెరిచారు. తొలిదశలో రెన్యువల్స్ పొందిన పాత బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు క్రమేణా తెరచుకుంటున్నాయి.

07/04/2017 - 00:24

అమరావతి, జూలై 3: ఫార్ములా త్రీ... ఓ కలల ప్రాజెక్టు. ఇప్పుడు అమరావతి రేస్ రిసార్ట్ ప్రాజెక్టు రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో సాకారం అయ్యేందుకు ఫార్ములా త్రీ అయింది. రయ్యున దూసుకుపోయే కార్లు.. అందుకోసమే ప్రత్యేకంగా రూపొందించిన కిలోమీటర్ల ట్రాక్.. ఇప్పుడు పర్యాటకాంధ్రప్రదేశ్‌లో దర్శనం ఇవ్వబోతున్నాయి.

Pages