S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/25/2016 - 05:22

విజయవాడ, జూన్ 24: విదేశీ పెట్టుబడుల కోసం పలు కంపెనీలతో ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి చైనాకు బయలుదేరి వెళ్లనుంది. ఈ పర్యటన ఖర్చుల కోసం కోటి 20 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కోటి రూపాయలు విడుదల చేసింది.

06/24/2016 - 18:29

చిత్తూరు: మొలకలచెరువు మండలంలోని ఆర్‌ఎస్‌ కొత్తపల్లెకు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని ప్రకటించారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు.

06/24/2016 - 17:42

కర్నూలు: ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇక్కడికి సమీపంలోని ఇ.తాండ్రపాడులో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు కొద్దిరోజుల క్రితం అత్యాచారం చేశారు. ఈ విషయం చెప్పడానికి భయపడిన ఆమె తన భర్తకు చెప్పకుండా బంధువుల ఇంటికి వెళ్లింది. భార్య కోసం గాలిస్తున్న భర్తకు అసలు విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

06/24/2016 - 16:43

విజయవాడ: స్విస్ ఛాలెంజ్ పద్థతిలో ఏపీ రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని, రాజధాని నిర్మాణానికి జపాన్ కంపెనీ ముందుకు వచ్చిందని, చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

06/24/2016 - 16:17

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాబోయే 72 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఇక్కడి వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. దీంతో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

06/24/2016 - 12:18

తిరుమల: తిరుమలలో శుక్రవారం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6గంటలు, కాలినడక భక్తులకు 4గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

06/24/2016 - 12:08

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఎపిలో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలకు భూముల కేటాయింపు, ప్రైవేటు రంగంలో వెటర్నరీ, అగ్రికల్చర్ , హార్టీకల్చర్ కళాశాలల ఏర్పాటుకు సమావేశంలో అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. రైతులకు రుణమాఫీ, పంటల పరిస్థితులు తదితర అంశాలపై కూడా చర్చ జరుగుతుందని సమాచారం.

06/24/2016 - 12:07

హైదరాబాద్: ఈనెల 27లోగా ఎపి ఉద్యోగులంతా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో హైదరాబాద్ నుంచి సిబ్బంది తరలివెళుతున్నారు. ఏళ్ల తరబడి హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భారమైన హృదయాలతో ఎపి ఉద్యోగులు అమరావతి బాట పట్టారు. అయితే, అందరికంటే భిన్నంగా వాణిజ్యపన్నుల శాఖలో అధికారిణిగా పనిచేస్తున్న పద్మ సైకిల్‌పై అమరావతికి బయలుదేరారు.

,
06/24/2016 - 05:40

గుంటూరు, జూన్ 23: హైదరాబాద్‌లోని సచివాలయ ఉద్యోగుల తరలింపు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం రాత్రి వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఉద్యోగులు గుంటూరుకు చేరుకున్నారు.

06/24/2016 - 05:33

విజయవాడ, జూన్ 23: రాష్టమ్రంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం నగరంలో సిఎం క్యాంప్ కార్యాలయంలో జరగనుంది. ప్రధానంగా ఉద్యోగుల తరలింపు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులు, కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు, చైనా పర్యటనపై సమీక్ష జరగనున్నట్లు తెలియవచ్చింది.

Pages