S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/25/2017 - 03:28

విజయవాడ, జూన్ 24: గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమరావతిలో అంతర్జాతీయ నృత్య, సంగీతోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అధికారులను ఆదేశించారు. ప్రపంచం నలుమూలల నుండి నృత్య, సంగీత అభిమానులు తరలివచ్చేలా అంతర్జాతీయ వేడుకలా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రముఖ సంగీతకారుడు, వయోలినిస్ట్ ఎల్ సుబ్రహ్మణ్యంకు సూచించారు.

06/25/2017 - 03:28

విజయవాడ, జూన్ 24: రాష్టవ్య్రాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విశాఖ భూ వివాదాలపై శుభతిథి పంచాంగం 2017-18లో శ్రీ కాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ చెప్పిన జోస్యం నిజమయినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

06/25/2017 - 03:26

విశాఖపట్నం, జూన్ 24: సాధారణ పౌరుల మాదిరి మానసిక వికలాంగులకూ సమాన హక్కులు ఉంటాయని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. ‘మానసిక రోగులు, వైకల్యం గల వారికి న్యాయ సేవల అమలు’ అంశంపై విశాఖలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక వికలాంగుల హక్కులు సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

06/25/2017 - 03:24

మనుబోలు, జూన్ 24: నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిథిలోని అక్కంపేట గ్రామంలోని యుపి పాఠశాలలో 6,7తరగతులను కొనసాగించాలని హైకోర్టు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో రేషనైలేజషన్ ప్రకారం పాఠశాలను డిగ్రేడ్ చేస్తూ డిఈఓ ఆదేశించారు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్‌రెడ్డి డిఈఓ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే.

06/25/2017 - 03:23

ఒంగోలు,జూన్ 24:రాష్ట్రప్రభుత్వం మద్యం బార్లకు లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లను మంజూరు చేసే ప్రక్రియకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రకాశం జిల్లాలో బార్లకు లైసెన్స్‌లు పొందేందుకు మద్యం వ్యాపారులు పరుగులు తీసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఒంగోలు,చీరాల, కందుకూరు, మార్కాపురం ప్రాంతాల్లో ఇప్పటివరకు 30 మద్యం లైసెన్స్ బార్లు ఉండగా కొత్తగా మరో నాలుగు బార్లు మంజూరు అయ్యాయి.

06/25/2017 - 03:22

విశాఖపట్నం (గోపాలపట్నం), జూన్ 24: విశాఖలో కంటైనర్ లారీ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి భీమవరం వైపు వెళ్తున్న కంటైనర్ ట్రాలర్ ఎన్‌ఎడి జంక్షన్ వద్దకు వచ్చే సరికి బ్రేకులు ఫెయిలవడంతో అదుపుతప్పింది. దీంతో ట్రాలర్ పైనున్న కంటైనర్ ఒక్కసారిగా పక్కకు పడిపోయింది.

06/24/2017 - 03:12

విజయవాడ, జూన్ 23: మహిళా సాధికారతకు సంబంధించిన అమరావతి డిక్లరేషన్ ముసాయిదా సిద్ధమైందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు.

06/24/2017 - 03:10

ఏలూరు, జూన్ 23: ఏ కార్యాలయం చూసినా ఒక అధికారి, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బంది ఉంటారు. వాళ్లకి జీతం, ఇతర భత్యాలు అ అధికారి ఆధ్వర్యంలో, ఆయా శాఖలు అందిస్తుంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ వ్యవస్థల్లో సాధారణంగా ఇదే తీరు దర్శనమిస్తుంది. కానీ దేవుడి వ్యవహారాలు చూసే దేవాదాయ ధర్మాదాయ శాఖలో మాత్రం చాలామంది ఉద్యోగులు, అర్చకులు, సిబ్బందికి జీతభత్యాల విషయంలో దేవుడే దిక్కు అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.

06/24/2017 - 02:33

అమరావతి, జూన్ 23: ప్రధాని నరేంద్రమోదీ-ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్య బంధం బలపడుతోందా? చంద్రబాబునాయుడు కూడా తన పాత ధోరణి మార్చుకుని మోదీతో సఖ్యతగా ఉంటున్నారా? మోదీ కూడా బాబుపై గత వైఖరిని మార్చుకుని ఆయనతో కలసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఈ వాదన నిజమేననిపించక మానదు. మోదీ-బాబు మధ్య బంధం మరింత బలపడుతోంది.

06/24/2017 - 02:29

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 23: ముస్లింల సంక్షేమాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

Pages