S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/24/2017 - 00:08

విజయవాడ, జూన్ 23: రుణామాఫీ అన్నది ఫ్యాషన్ కాదని, అవసరమని రాష్ట్ర ఆర్థిక యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రుణమాఫీ ఫ్యాషన్‌గా మారిందని ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి యనమల పై విధంగా స్పందించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం యనమల విలేఖరులతో మాట్లాడారు.

06/24/2017 - 00:08

విజయవాడ, జూన్ 23: దేశ వ్యాప్తంగా జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలు కానున్న జిఎస్‌టి వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరుగునున్నాయి. కొన్నింటి ధరలు తగ్గనున్నాయి. కొన్ని వస్తువుల ధరలు 0.5 శాతం నుంచి 27 శాతం వరకూ తగ్గనున్నాయి.

06/24/2017 - 00:06

విజయవాడ, జూన్ 23: పర్యాటకానికి ప్రచారమే కీలకమని, ఈ విషయంలో సరైన చర్యలు తీసుకుంటేనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించగలుగుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి ప్రచారం పెట్టుబడి వంటిదే తప్ప వ్యయంగా చూడరాదని వివరించారు.

06/23/2017 - 02:15

విజయవాడ, జూన్ 22: స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, దాతల సహకారానికి ప్రభుత్వం కూడా తనవంతు తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

06/23/2017 - 02:13

రేణిగుంట, జూన్ 22: జాతీయ జెండా స్ఫూర్తితో దేశం అభివృద్ధికోసం అందరూ సంఘటితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన ఎయిర్‌పోర్ట్ అథారిటీ రూ.15 లక్షల నిధులు వెచ్చించి 100 అడుగుల ఎత్తు, 20న30 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

06/23/2017 - 02:11

దర్శి, జూన్ 22: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లపై ఇక నుండి ఐసిడిఎస్ సీలు వేస్తామని రాష్ట్ర స్ర్తి, శిశుసంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా దర్శిలోని శివాలయం వీధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీకేంద్రంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారి ప్రతిభపాటవాలను పరిశీలించారు.

06/23/2017 - 02:09

విశాఖపట్నం, జూన్ 22: కాలేయం దెబ్బ తిన్న తన భర్తను కాపాడుకునేందుకు ఓ భార్య తన కాలేయంలో సగమిచ్చి, భర్తకు ప్రాణదానం చేసింది. 22 మంది డాక్టర్ల బృందం ఓ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి వీరిద్దరూ మళ్లీ కలకాలం జీవించేలా చేసింది. విశాఖకు చెందిన తాటికొండ సుందరరావు కాలేయం పూర్తిగా దెబ్బతింది. ప్రాణాపాయం దగ్గర పడింది. తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఎవరిని అర్థించాలో భార్య మాధురికి తెలియలేదు.

06/23/2017 - 02:04

కాకినాడ, జూన్ 22: సముద్రంలో వేట సాగించే మత్యకారుల భద్రత, రక్షణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కోస్తా తీర ప్రాంతంలో సముద్రంలో వేట విరామం అనంతరం మత్స్యకారుల కార్యకలాపాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో లోతైన సముద్ర జలాల్లో రోజుల తరబడి వేట సాగించే జాలర్ల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ప్రభుత్వం స్పష్టంచేసింది.

06/23/2017 - 00:35

విజయవాడ, జూన్ 22: అగ్రిగోల్డ్ ఆస్తుల్ని తెలుగుదేశం నేతలు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంస్థ ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే, ప్రభుత్వంపై వారు చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.

06/23/2017 - 00:35

విజయవాడ, జూన్ 22: రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తానని రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్య అధ్యక్షుడు కొండూరు పాలుశెట్టి అన్నారు. మత్స్య సహకార సమాఖ్య అధ్యక్షునిగా గురువారం బాధ్యతలు చేపట్టిన తరువాత సచివాలయం నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో చైర్మన్‌గా నియమించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Pages