S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/21/2017 - 00:00

న్యూఢిల్లీ, జూన్ 20: తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్‌కు సంబంధించిన ఫైలు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరుకుంది. ఇప్పటికే ఈ సర్వీసు రూల్స్ ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సంతకం చేసి ఆమోదించిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ ఫైలుపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేశారు.

06/21/2017 - 00:00

తిరుపతి, జూన్ 20: విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు బాబు భయపడుతున్నారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్సా సత్యనారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా వైకాపా ప్లీనరీ సమావేశంలో బొత్సా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ భూ కుంభకోణానికి సంబంధించిన రికార్డులు హుద్‌హుద్ తుఫాన్‌లో కొట్టుకుపోయాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

06/20/2017 - 23:59

నెల్లూరు, జూన్ 20: సిబిఐ నమోదు చేసిన 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో మహాధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.

06/20/2017 - 23:59

ఒంగోలు,జూన్ 20:రాబోయే కాలంలో 30 సంవత్సరాలపాటు జగన్ పాలన రాష్ట్రంలో రానుందని వైకాపా రాష్టమ్రహిళా అధ్యక్షురాలు, నగరి శాసన సభ్యురాలు ఆర్‌కె రోజా జోస్యం చెప్పారు. వైకాపా ప్రకాశం జిల్లా ప్లీనరీ సమావేశం మాజీ మంత్రి బాలినేని అధ్యక్షతన ఒంగోలులో మంగళవారం జరిగింది. ఈ ప్లీనరీకి ముఖ్యఅతిధిగా హాజరైన రోజా మట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.

06/20/2017 - 23:58

విజయవాడ, జూన్ 20: వస్త్రాలపై జిఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వస్త్ర వ్యాపారులు ఈ నెల 22, 23 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి చెప్పారు.

06/20/2017 - 23:58

విశాఖపట్నం, జూన్ 20: బంగాళాఖాతంలో విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మధ్య అల్పపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది. దీని ప్రభావం వలన కోస్తాలో అక్కడడక్కడ చెదురు మదులు జల్లులు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల పొడి వాతావరణమే ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

06/20/2017 - 23:57

శ్రీకాకుళం, జూన్ 20: వేసవిని తలపించేలా ఉదయం 9 గంటల నుండి ఒంటి గంట వరకు ఎండ తీవ్రతతో జనాన్ని భయపెట్టిన మంగళవారంనాటి వాతావరణం ఒక్కసారి మారిపోయింది. భారీ వర్షానికి పిడుగులు తోడు కావడంతో జిల్లాలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయితీ రుప్పపేటకు చెందిన జయమ్మ(40) మేకలు మేపుతుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది.

06/20/2017 - 23:56

విజయనగరం, జూన్ 20: కాపులకు రిజర్వేషన్ విషయంలో చావోరేవో తేల్చుకుంటామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ దాని గురించి నేటి వరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/20/2017 - 23:56

విజయవాడ (క్రైం), జూన్ 20: రాష్ట్రంలో తొలి విడతగా 12 మంది ఐపిఎస్‌ల బదిలీలు జరిగాయి. ఐపిఎస్‌ల బదిలీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండురోజులుగా తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. పలువురు ఐపిఎస్ అధికారులతో ముఖ్యమంత్రి సోమ, మంగళవారాల్లో భేటీ అయ్యారు. వ్యక్తిగతంగా అధికారులతో మాట్లాడి బదిలీలపై సుదీర్ఘంగా చర్చించారు.

06/20/2017 - 23:55

విజయవాడ, జూన్ 20: రాష్ట్రంలోని ఆరు నగర పాలక సంస్థలకు ఈ ఏడాది ఎన్నికలు ఇక లేనట్లే. ఆయా నగర పాలక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయ. రాష్ట్రంలో గ్రేటర్ విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, తిరుపతి నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. చాలా నగర పాలక సంస్థలకు ఐదు సంవత్సరాలుగా పాలక వర్గాలు లేక ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగుతున్నాయి.

Pages