S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/16/2017 - 03:24

అమరావతి, జూన్ 15: భూ కబ్జా, మోసం, ఫోర్జరీ వంటి వివిధ కేసుల్లో అరెస్టయి హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతపురం జిల్లా టిడిపి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీనితో అరెస్టయిన దీపక్‌రెడ్డిని ఇప్పటివరకూ ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు బాబు తెరదించినట్టయింది.

06/16/2017 - 03:23

పులివెందుల, జూన్ 15: సార్వత్రిక ఎన్నికలకు ముందు అసాధ్యమైన హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందారని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కడప జిల్లా పులివెందులలోని వైకాపా కార్యాలయంలో గురువారం ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు.

06/16/2017 - 03:03

అమరావతి, జూన్ 15: నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరు దాదాపు ఖరారయింది. ఇప్పటివరకూ ఆయనకు పోటీగా ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లడం, మాజీ మంత్రి ఫరూఖ్, ఎంపి ఎస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు సహా అందరూ బ్రహ్మానందరెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారయింది.

06/16/2017 - 03:03

విజయవాడ, జూన్ 15: అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు రద్దయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులు ఆరంభం నుంచి ఎన్నో అడ్డదారులు తొక్కినట్టు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని)..

06/16/2017 - 02:55

అమరావతి, జూన్ 15: కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలిపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆమె దూకుడు విధానం, అవగాహనా రాహిత్యం వల్లే నంద్యాల నియోజకవర్గంలో మునిసిపాలిటీ, మండలాలల్లో టిడిపి నేతలంతా శిల్పా మోహన్‌రెడ్డితో వెళ్లిపోయారన్న అసంతృప్తితో ఉన్న నాయకత్వం, ఇకపై ఆమె దూకుడుకు కళ్లెం వేయడం ద్వారా కొత్తగా ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని నిర్ణయించింది.

06/16/2017 - 02:54

విజయవాడ (రైల్వే), జూన్ 15: దేశ వ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి సగటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. దేశానికి లాజిస్టిక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుందన్నారు.

06/16/2017 - 02:50

తెనాలి, జూన్ 15: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, అమరావతి, గుంటూరు రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2680 కోట్లు కేటాయించినట్లు రైల్వేశాఖామంత్రి సురేష్‌ప్రభు తెలిపారు. గురువారం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఏర్పాటుచేసిన ‘సబ్‌కాసాత్ - సబ్‌కా వికాస్’ (అందరితో కలిసి -అందరికీ అభివృద్ధి) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

06/16/2017 - 02:49

విజయవాడ(బెంజిసర్కిల్), జూన్ 15: తప్పు జరిగితే ఎలాంటి విచారణకైనా సిద్ధమని మహానాడులో సవాల్ విసిరిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడెక్కడ ఉన్నారని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకుంభకోణాలు జరుగుతుంటే సిబిఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ప్రశ్నించారు.

06/16/2017 - 01:52

కాకినాడ, జూన్ 15: గడచిన మూడేళ్ల ఎన్డీయే పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ సాధించింది శూన్యమని, ప్రచారార్భాటాలకు మాత్రమే పరిమితమయ్యారని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్ళంరాజు విమర్శించారు. పెద్దనోట్లను రద్దుచేసి సామాన్యుడిని పిడుగుపాటుకు గురిచేశారని, నోట్ల రద్దు అనంతరం ఏమేరకు నల్లధనాన్ని వెలికితీశారో నేటికీ బహిర్గతం చేయలేదన్నారు.

06/16/2017 - 01:48

విశాఖపట్నం, జూన్ 15: వ్యవసాయ కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అన్ని కార్మిక సంఘాల మద్దతుతో దేశవ్యాప్త పోరాటాలు నిర్మిస్తామని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు, ఎపి, తెలంగాణ అగ్రికల్చర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి పేర్కొన్నారు.

Pages