S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/15/2017 - 03:44

విజయవాడ (క్రైం), జూన్ 14: ‘వంగవీటి’ సినిమా కేసులో సెన్సార్ బోర్డు, పోలీసులను పార్టీలుగా చేర్చాలని విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘వంగవీటి’ సినిమాపై గతంలో తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే.

06/15/2017 - 03:43

విజయవాడ(బెంజిసర్కిల్), జూన్ 14: ప్రతి ఏడాది బీజింగ్‌లో నిర్వహించే ది హ్యుమానిటీ ఫొటో అవార్డ్స్‌కి విజయవాడ నగరానికి చెందిన ది హిందూ సీనియర్ స్పెషల్ న్యూస్ ఫొటోగ్రాఫర్ సిహెచ్‌విఎస్ విజయభాస్కరరావు ఎంపికయ్యారు. వివిధ విభాగాలకు సంబంధించి మన దేశం నుండి 18 మందితో పాటు 133 దేశాలకు చెం దిన 6387 మంది ఫొటోగ్రాఫర్లు ఈ అవార్డు కోసం పోటీపడగా దేశం నుండి ఏకైక విజేతగా విజయభాస్కరరావు ఎంపికయ్యారు.

06/15/2017 - 03:42

విశాఖపట్నం, జూన్ 14: ఆహార ఉత్పత్తుల నిల్వకు సంబంధించి యాంత్రీకరణ ద్వారా ఆధునిక పద్ధతులు పాటించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల సహాయ మంత్రి సిఆర్ చౌదరి సూచించారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ), కేంద్ర గిడ్డంగుల సంస్థ, భారత నాణ్యత ప్రమాణాల సంస్థ (బిఐఎస్)ల ప్రతినిధులతో విశాఖలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

06/15/2017 - 01:19

అమరావతి, జూన్ 14: ఐటి హబ్‌గా మార్చి విశాఖను దేశంలో నెంబర్ వన్ పర్యాటక, సాంకేతిక రాజధానిగా నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం కబ్జాదారుల దూకుడు వల్ల నెరవేరేలా కనిపించడం లేదు. స్వయంగా అధికారపార్టీకి చెందిన ప్రభుత్వ ప్రముఖులే కబ్జాలకు కర్త,కర్మ,క్రియగా అవతారమెత్తిన ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం కబ్జాల రూపంలో ప్రముఖుల జేబుల్లోకి చేరుతోంది.

06/15/2017 - 01:18

విజయవాడ, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల డిఎ బకాయిలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా వేతన సవరణకు సంబంధించిన ఎరియర్స్‌పై కమిటీని నియమించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం తనను కలిసిన ఎన్జీవో నేతలకు హామీ ఇచ్చారు.

06/15/2017 - 01:16

విజయవాడ, జూన్ 14: పేదలకు అందిస్తున్న సబ్సిడీల్లో విధిస్తున్న కోతలో భాగంగా తాజాగా ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలు, రవాణా చార్జీల భారం పేరిట రేషన్ డిపోలు ఎత్తివేయకుండా ప్రజాపంపిణీ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం కలిసిన సిపిఐ నాయకుల బృందం కోరింది.

06/15/2017 - 01:15

విజయవాడ, జూన్ 14: విశాఖ భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణపై ఎవరికీ అపోహలు అక్కర్లేదు.. నిష్పక్షపాత విచారణ జరిపించి, ఆక్రమణదారులను ఆధారాలతో పట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే సిట్ ఏర్పాటు చేశామని ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. సిట్ ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బుధవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు.

06/15/2017 - 01:15

ఇంద్రకీలాద్రి, జూన్ 14: డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం వ్యవసాయ సీజన్‌కు ముందే మద్దతు ధరలు ప్రకటించి రైతులు, కౌలురైతులకు రుణాలు అందచేయాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచాలన్నారు.

06/15/2017 - 01:14

అమరావతి, జూన్ 14: ఇటీవల అత్యాచారానికి గురైన ఒక బాలిక ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఫోటో ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టుకావడం విమర్శలకు తావిస్తోంది. బాధితురాలిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లగా ఆమెతో మాట్లాడిన బాబు సదరు బాధితురాలి చెప్పిన విషయాలు విని చలించిపోయారు.

06/15/2017 - 01:13

విజయవాడ, జూన్ 14: వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్టీకి నిరసనగా ఈ నెల 15న రాష్టవ్య్రాపితంగా వస్త్ర దుకాణాల బంద్ పాటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తెలిపారు.

Pages