S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/13/2017 - 02:00

విశాఖపట్నం, జూన్ 12: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బంగ్లాదేశ్ వద్ద సోమవారం ఉదయం తీరం దాటిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అగర్తలాకు వాయువ్య దిశగా 30 కిమీ దూరంలో కేంద్రీకృతమై, వచ్చే 12 గంటల్లో మరింత బలహీనపడుతుందని పేర్కొంది.

06/13/2017 - 01:58

కావలి టౌన్, జూన్ 12: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రజా పథకాల ద్వారా లబ్ధిపొందని వారు ప్రజాప్రతినిధులను నిలదీసి మరి అడిగి ఆ పథకాలను వినియోగించుకోవాలని కేంద్ర శాస్తస్రాంకేతిక శాఖామంత్రి సుజనా చౌదరి ప్రజలకు సూచించారు. నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం జరిగిన సబ్‌కాసాత్, సబ్‌కా వికాస్ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.

06/13/2017 - 01:58

చిత్తూరు, జూన్ 12: తుఫాన్, ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో శక్తివంతమైన బ్యాటరీలతో విద్యుత్ అంతరాయాన్ని నివారిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు వెల్లడించారు. చిత్తూరులో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని రెండు జిల్లాల పరిధిలోని రెండు మండలాలను ఎంపికచేసి బ్యాటరీలను అమర్చుతామని వివరించారు.

06/13/2017 - 01:21

అమరావతి, జూన్ 12: సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో నాయకత్వం అనుసరిస్తోన్న అలసత్వ విధానం పార్టీ కొంపముంచుతోందన్న ఆందోళన టిడిపి శ్రేణుల్లో పెరుగుతోంది. ఎప్పటి నిర్ణయాలు అప్పుడు తీసుకోకుండా సమావేశాలు, రాయబారాల పేరుతో చేస్తున్న కాలయాపన, చేతులు కాలిన తర్వాత చర్యలకు దిగుతున్న తీరు బలమైన నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు దోహదపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

06/13/2017 - 01:20

కాకినాడ, జూన్ 12: సముద్రంలో వేటకు వెళ్ళిన కాకినాడకు చెందిన ఏడుగురు జాలర్ల ఆచూకీ గల్లంతయ్యింది. మే 31వ తేదీన ఫైబర్ బోటుపై వేటకు వెళ్ళిన సదరు జాలర్ల ఆచూకీ 13రోజులుగా లభించకపోవడంతో బాధిత కుటుంబాలు సోమవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ఆశ్రయించాయి.

06/13/2017 - 01:16

విజయవాడ, జూన్ 12: న్యూఢిల్లీలోని ఏపి భవన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార కేంద్రం ప్రత్యేకాధికారిగా కంచర్ల జయరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కంచర్ల జయరావుకు పదోన్నతి కల్పించి న్యూఢిల్లీ ఏపి భవన్ సమాచార కేంద్రం ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

06/13/2017 - 01:15

విజయవాడ, జూన్ 12: రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు సిఎం చంద్రబాబు స్ఫూర్తితో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కల్సి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఐడిసి) చైర్మన్‌గా సోమవారం నాడిక్కడ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ తెలిపారు.

06/13/2017 - 01:14

అమరావతి, జూన్ 12: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు టిడిపి నాయకత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా మాల వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్ (ప్రకాశం), బీసీ వర్గానికి చెందిన పంచుమర్తి అనూరాధ (కృష్ణా) పేర్లు దాదాపు ఖరారయినట్లు సమాచారం. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిద్దరి పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

06/13/2017 - 01:14

విజయవాడ, జూన్ 12: పంటలు పోయాయనో, అప్పుల పాలయ్యామనో ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పంట కాకపోతే మరో పంటకైనా రైతుల్ని గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

06/13/2017 - 01:13

విజయవాడ, జూన్ 12: భారత్‌లో జపాన్ కంపెనీలన్నింటికీ అమరావతినే ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జైకా, మేటీలకు సూచించారు. జపాన్‌కు చెందిన ఈ రెండు సంస్థలు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్టుగా ఏపీలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు.

Pages