S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/12/2017 - 03:07

విశాఖపట్నం, జూన్ 11: స్వరాజ్యం సురాజ్యం కావాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ జనరంజక పాలన సాగిస్తున్నారని, అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే దిశగా మోదీ మూడేళ్ల పాలన పూర్తయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు.

06/12/2017 - 02:58

విజయవాడ, జూన్ 11: జిఎస్టీని రద్దు చేసేంతవరకూ రాష్టవ్య్రాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులమంతా ఐక్యంగా పోరాడతామని ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి చెప్పారు. కేంద్రం విధించిన జిఎస్టీని రద్దుచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ అత్యవసర సర్వసభ్య సమావేశం విజయవాడ కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ ఆవరణలో ఆదివారం జరిగింది.

06/12/2017 - 02:29

విజయవాడ, జూన్ 11: ‘మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా చూడటం లేదు!’.. ఇది తరచుగా ఆబ్కారీ శాఖ మంత్రి చేసే ప్రకటన. అక్రమ మద్యాన్ని నిరోధించేందుకు మాత్రమే మద్యం విక్రయాలపై దృష్టి పెట్టామంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తున్నప్పటికీ మద్యం వల్ల కలిగే చెడు ఫలితాలపై ప్రచారం చేసేందుకు మొక్కుబడిగా నిధులు కేటాయించారు.

06/12/2017 - 02:24

తిరుపతి, జూన్ 11: ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్టప్రతి పదవికి యోగ్యుడని టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. ఆయన ఆ పదవికి పోటీ చేయాలని, ఆయన రాష్టప్రతి అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఇది తన అభిప్రాయమన్నారు.

06/12/2017 - 02:21

చిత్తూరు, జూన్ 11: ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. వచ్చే నెల అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభకు సంబంధించి ఆదివారం చిత్తూరులో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నమ్మక ద్రోహి అని, మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

06/12/2017 - 02:20

విజయవాడ, జూన్ 11: వైద్య, ఆరోగ్య శాఖలో డెప్యుటేషన్ల వ్యవహారం విమర్శలకు గురవుతోంది. సిబ్బంది బదిలీల్లో పారదర్శకత పాటించాలనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటన మాటలకే పరిమితమైంది. బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత డెప్యుటేషన్ పేరుతో పనిచేస్తున్న చోటికే పోస్టింగ్‌లు ఇవ్వడం వెనుక భారీగా ముడుపుల వ్యవహారం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

06/12/2017 - 01:18

విజయనగరం, జూన్ 11: రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టుకురావడం, ఇంజనీరింగ్ పరీక్ష రాసిన విద్యార్థుల కంటే సీట్లు అధికంగా ఉండటం వల్ల ప్రతీ ఏటా వేలాది సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు అదనంగా ఉన్న సీట్లను స్వచ్ఛందంగా ఇచ్చేయాలని జెఎన్‌టియు(కె) కోరింది.

06/12/2017 - 01:17

రాజమహేంద్రవరం, జూన్ 11: త్వరలో మంజునాథ్ కమిషన్ నివేదిక అందనుందని, నివేదిక వచ్చిన వెంటనే కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి ప్రభుత్వపరంగా ప్రతిపాదిస్తామని రాష్ట్ర డిప్యూటీ సిఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం మోరంపూడిలోని బార్లపూడి రవికుమార్ ఫంక్షన్ హాలులో ఆదివారం కాపు వెల్ఫేర్.కామ్ మొబైల్ యాప్‌ను డిప్యూటీ సిఎం చినరాజప్ప ఆవిష్కరించారు.

06/12/2017 - 01:17

విశాఖపట్నం, జూన్ 11: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూ రెండు రోజుల్లో బలమైన వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం ఆదివారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఈ కేంద్రం తెలిపింది. దక్షిణకోస్తాలోను పలుచోట్ల వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలియజేసింది.

06/12/2017 - 01:16

అమలాపురం,జూన్ 11: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఒఎన్‌జిసి పైపులైన్లు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆదివారం అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో గల ఒఎన్‌జిసి పైపులైను పగిలి పెద్దఎత్తున గ్యాస్ లీకవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులుతీశారు. వివరాలిలా ఉన్నాయి.

Pages