S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/12/2017 - 00:41

విజయవాడ, జూన్ 11: విద్యుదాఘాతానికి గురై మృతి చెందినవారి కుటుంబాలకు, అంగవైకల్యానికి గురైనవారికి విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ నష్టపరిహారం చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఈఆర్‌సి) కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన కింద విద్యుదాఘాతానికి గురై మృతిచెందినా, అంగవైకల్యానికి గురైనా భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది.

06/12/2017 - 00:40

తుళ్లూరు, జూన్ 11: గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పచ్చగడ్డికి కొరత ఏర్పడింది. గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించక ముందు ఈప్రాంతంలో ఏడాది పొడవునా పుష్కలంగా పచ్చగడ్డి లభించేది. కృష్ణానదీ తీరంలోని లంక గ్రామాల్లో బోర్ల ద్వారా నీటిని తోడి మూడు కాలాల్లోనూ పంటలు పండించేవారు. మెట్ట ప్రాంతంలో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని పొలాలకు అందించేవారు.

06/11/2017 - 23:07

విజయవాడ, జూన్ 10: వాణిజ్యపరంగా వినియోగించే మోటారు వాహనాలకు డ్రైవర్ల డిమాండ్ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తొలిదశలో కనీసం వంద డ్రైవర్ శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ శిక్షణ పొందిన డ్రైవర్లను కేంద్ర సర్టిఫైడ్ కమర్షియల్ డ్రైవర్లుగా గుర్తిస్తారు.

06/11/2017 - 23:05

రాజమహేంద్రవరం, జూన్ 10: ఇటు గోదావరి బేసిన్‌లో డెల్టాల ఆధునీకరణతోపాటు ఏలేరు ఆధునికీకరణ పనులకు కూడా అతీగతీ లేకుండా పోయింది. సాగు జలాలు విడుదలతో డెల్టాలో ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయి. ఏలేరు పనులు నత్తనడక సాగడంతో అతీగతీ లేకుండా ఉంది. నిధులు మంజూరైన మూడేళ్లకు గానీ ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టలేదు. తీరా మొదలైన తర్వాత వర్షం సీజన్ ముంచుకురావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

06/11/2017 - 23:05

విజయవాడ, జూన్ 10: అమరావతి రాజధాని నగర అభివృద్ధికి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, ముళ్లపూడి చంద్రమతీదేవి స్మారకార్థం కోటి రూపాయల విరాళాన్ని వారి తనయుడు ముళ్లపూడి తిమ్మరాజా ప్రకటించారు. ఈ మేరకు ఏపి సిఆర్‌డిఏ కమిషనర్ పేరిట కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి కార్యాలయంలో శనివారం అందజేశారు.

06/11/2017 - 23:04

తిరుపతి, జూన్ 10: జిఎస్‌టి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి మినహాయింపునిచ్చే అధికారం ప్రస్తుతం రాష్ట్రానికి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శనివారం కల్యాణోత్సవం సమయంలో ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

06/11/2017 - 23:57

విశాఖపట్నం, జూన్ 10: సద్గురు శివానందమూర్తి నిరంతర సత్యానే్వషి అని, ఒక ఆధ్యాత్మిక నిఘంటువని పలువురు ప్రముఖులు కొనియాడారు. శివానందమూర్తి జీవిత సంగ్రహంపై శివానంద సుపథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల సదస్సు విశాఖ కళాభారతి ఆడిటోరియంలో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచ శాంతి, మానవాళి మనుగడకు సద్గురువుల ఆధ్యాత్మికమార్గం ఎంతో దోహదపడుతుందన్నారు.

06/11/2017 - 02:18

ఏలూరు, జూన్ 10: ఇన్నాళ్లు దేశం అధినేత అపురూపంగా చెప్పుకుంటున్న కంచుకోటకు బీటలు వారుతున్నట్లే కనిపిస్తోంది. మొత్తంగా పార్టీ ప్రతిష్ఠ మసకబారి చివరకు పార్టీలోనే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే వరకు పరిస్థితి వచ్చేసింది. మరికొందరు నేతలు వారసులతో వివాదాల్లో చిక్కుకుంటే, మరికొందరు ఇసుక, మట్టి వివాదాల్లో మచ్చ వేయించుకున్నారు.

06/11/2017 - 02:17

విజయవాడ, జూన్ 10: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసును స్వయంగా పరిశీలించాలంటూ ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును శనివారం విజయవాడలో ఆ నియోజకవర్గానికి చెందిన 200 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కోరారు.

06/11/2017 - 02:17

ఏలూరు, జూన్ 10: ఉభయరాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితి ఏలా తయారైందంటే అప్పట్లో గాంధీ చెప్పిన సూక్తిలో మూడుకోతులు మాదిరిగా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎపి ప్రతిపక్షనేత జగన్‌లు తయారయ్యారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టరు కె నారాయణ విమర్శించారు. ఒకరు అన్యాయాలపై మాట్లాడరని, మరొకరు ఏం జరుగుతుందో చూసే పరిస్దితిలో లేరని, మరొకరికి ఏది వినపడదని వారి ముగ్గుర్ని ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు.

Pages