S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/11/2017 - 02:16

విజయవాడ, జూన్ 10: ప్రభుత్వ విధానాలలో డిజిటలైజేషన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ సలహాదారు అన్నారాయ్ పేర్కొన్నారు. విజయవాడలోని స్థానిక ఆర్టీసీ భవనం ప్రాంగణంలోని ఎపి ఫైబర్‌నెట్ ప్రధాన కార్యాలయంలో శనివారం రాష్ట్రంలో అమలు చేస్తున్న డిజిటలైజేషన్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.

06/11/2017 - 02:16

విజయవాడ, జూన్ 10: దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న భూస్వామ్య పెట్టుబడి, దోపిడీ విధానాలు, మహిళల పట్ల సాగుతున్న వివక్షత, హింసకు వ్యతిరేకంగా మహిళా లోకం ఐక్యంగా ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) రాష్ట్ర 7వ మహాసభలు శనివారం విజయవాడ నగరంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి 3వేల మంది మహిళలు పాల్గొన్నారు.

06/10/2017 - 01:37

నరసరావుపేట, జూన్ 9: భద్రతా చర్యల దృష్ట్యా ఇతరుల ప్రవేశానికి నిషిద్ధ ప్రాంతమైన అసెంబ్లీని చూసేందుకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాయకులకు అనుమతి ఇస్తున్నట్లు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విలేఖరులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల వారికి శుక్రవారమే ఈ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.

06/10/2017 - 01:35

అమరావతి, జూన్ 9: ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షం వైపు చూస్తున్న ఉద్యోగ వర్గాలను చేతులారా దూరం చేసుకుంటున్న తమ పార్టీ నేతల వైఖరిపై వైసిపిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉద్యోగులపై చేసిన దారుణ వ్యాఖ్యలతో ఉద్యోగ వర్గాలు దూరమవడం వైసిపి శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

06/10/2017 - 01:34

విజయవాడ, జూన్ 9: వాతావరణ మార్పులపై సమాచారం కోసం ఇస్రో, విపత్తుల నిర్వహణ సంస్థ, భారత వాతావరణ సంస్థ సంయుక్తంగా ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి ఈ మూడు విభాగాల ముఖ్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వాతావరణంలో మార్పులు, నీటి లభ్యత, తదితర అంశాలపై ప్రస్తుతం ఈ మూడు సంస్థలు వేర్వేరుగా పనిచేస్తూ నివేదికలు ఇస్తున్నాయన్నారు.

06/10/2017 - 01:32

విజయవాడ, జూన్ 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే రాష్ట్రంలోని అధికారులు, ఉద్యోగులను అండమాన్‌కు పంపించడమేకాక వారి కుటుంబ సభ్యులు పశ్చాత్తాప పడేలా చేస్తామంటూ బెదిరించిన ఆ పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ పార్టీ సైతం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ

06/10/2017 - 01:32

కూచిపూడి, జూన్ 9: కూచిపూడి నాట్యాద్యుడు శ్రీ సిద్ధేంద్ర యోగి ప్రశిష్యులైన నాట్యగురువులు మహాకవి క్షేత్రయ్య శాస్ర్తియ శృంగార పదాలను కూచిపూడి నాట్యంతో ప్రదర్శించి మొవ్వగోపాలుని అర్చించారు. కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మొవ్వ శ్రీ వేణుగోపాలుని ఆలయంలో శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు పండిత పామరుల ప్రశంసలు పొందాయి.

06/10/2017 - 01:31

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 9: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి హఠాన్మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

06/10/2017 - 01:30

విజయవాడ, జూన్ 9: ప్రజలకు ఎస్‌ఎంఎస్ ద్వారా వాతావరణ హెచ్చరికలు పంపే వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత వాతావరణ సంస్థ డైరెక్టర్ జనరల్ జెకె రమేష్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలో కొందరు రైతులకు వాతావరణ వివరాలు ఇలా తెలియచేస్తున్నామన్నారు. దేశంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యువి ఇండెక్స్ అవసరం లేదన్నారు.

06/09/2017 - 03:28

గుంటూరు, జూన్ 8: గతంలో బ్రాహ్మణులు పది మందికి సహాయం చేసే స్థితిలో ఉండేవారని, ప్రస్తుతం సమాజంలో వారి పరిస్థితి దారుణంగా మారిందని హంపీ పీఠాధీశ్వరులు శ్రీ విద్యారణ్య భారతీస్వామి ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం గుంటూరు కొత్తపేటలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని యడవల్లి బ్రాహ్మణ ధర్మసత్రాన్ని విద్యారణ్య భారతీస్వామి సందర్శించారు.

Pages