S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/31/2016 - 05:48

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్‌లో కాలం చెల్లిన బస్సుల స్థానంలో మూడు వేల కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపినట్టు ఆర్టీసీ ఎండి సాంబశివరావు చెప్పారు. బుధవారం నాడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం చెప్పారు.

03/31/2016 - 05:47

మంగళగిరి, మార్చి 30: ఆప్కో చైర్మన్, పాలక మండలి, అధికారుల పనితీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని బుధవారం మంగళగిరి పట్టణ శివారులోని ఎర్రబాలెం వద్దగల ఆప్కో తోట (డిఎంఓ ఆఫీసు) ప్రాంగణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం లిమిటెడ్ (ఆప్కో) 32వ సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు చైర్మన్ మురుగుడు హనుమంతరావును, అధికారులను నిలదీశారు.

03/31/2016 - 05:45

విజయవాడ, మార్చి 30: శాసనసభా సమావేశాలు ముగిశాయి. ప్రజా సమస్యలను ఏమేరకు చర్చించారన్న అంశాన్ని పక్కనపెడితే, సవాళ్లు, ప్రతి సవాళ్లతోనే సభా కాలం అంతా గడిచిపోయింది. అంతేకాదు, గత శాసనసభా సమావేశాలతో పోల్చి చూస్తే, ఈ సమావేశాల్లో అనేక అసాధారణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమావేశాల్లో రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

03/31/2016 - 05:16

శ్రీశైలం ప్రాజెక్టు, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ కనిష్ట నీటి మట్టానికి ఇంకా కిందికి తగ్గించి నీరు వాడుకునేందుకు అధికారులు సిద్ధవౌతున్నారు. మంచినీటి కొరత దృష్ట్యా కృష్ణానది యాజమాన్య బోర్డు 790 అడుగుల నీటిమట్టం వరకు నీటిని వాడుకునేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.

03/31/2016 - 05:08

విజయవాడ, మార్చి 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. భూమాతో సహా ఎనిమిది మంది ఒకే బృందంగా టిడిపిలో చేరిపోవడంతో మొదలైన వలసలు కొనసాగుతునే ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో వైకాపా ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి తీవ్ర ఇబ్బంది కలిగించింది. ఆయనతోపాటు వరుపుల సుబ్బారావు టిడిపిలోకి వెళ్లిపోతున్నారు.

03/31/2016 - 05:05

విజయవాడ, మార్చి 30: ప్రజాస్వామ్యాన్ని ఇటు అధికార తెలుగుదేశం పార్టీ అటు ప్రతిపక్ష వైకాపాలు ధనస్వామ్యంగా మార్చుతున్న ప్రస్తుత రోజుల్లో పార్టీ క్యాడర్‌ను కూడా కాపాడుకోవటం కష్టతరంగా మారుతుందనేది సిపిఐ పార్టీ కాస్తంత ఆలస్యమైనా గుర్తించింది.

03/31/2016 - 05:05

విజయవాడ, మార్చి 30: తనతో పరిచయమున్న ఓ మహిళ నగ్న చిత్రాల్ని ఫోన్‌లో తీసి ఆమెను మూడేళ్ల పాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆమె నుండి రూ.6 లక్షల్ని కాజేసిన కేటుగాడి గురించి ఎట్టకేలకు ఆ మహిళ బయటపెట్టింది.మాయమాటల్తో ఆ మహిళను బుట్టలో వేసుకుని నరకాన్ని చూపించిన ఆ నయవంచకుడిని విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

03/31/2016 - 05:06

విజయవాడ, మార్చి 30: రాష్ట్రంలోని కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలలో పనిచేస్తున్న దాదాపు 45 వేల మంది కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను తొలగించేందుకై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 279ని కార్మికులకు అనుకూలంగా తక్షణం సవరించాలంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసి పిలుపు మేరకు బుధవారం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది కార్మికులు నగర వీధులలో కదం తొక్కారు.

03/31/2016 - 05:06

ప్రొద్దుటూరు, మార్చి 30 : తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కడప జిల్లా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీరు అడుగంటిపోయింది. ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న కుడి, ఎడమ తూములకు చాలా రోజులుగా నీరు లేదు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్ల ద్వారా తోడుతూ ఏరోజుకారోజు గడిపేస్తున్నారు.

03/31/2016 - 04:56

హైదరాబాద్, మార్చి 30: కావల్సిన వారికే నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చుకుంటారా అని వైకాపా శాసనసభ్యులు బుధవారం ఎపి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ వైఖరిని విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. అనంతరం వైకాపా సభ్యులు శాసనసభ నుండి వాకౌట్ చేశారు.

Pages