S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/09/2017 - 01:11

విజయవాడ, జూన్ 8: ఉపాధి వేతనదారులకు బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పంలో దీన్ని చేపట్టాలన్నారు. ఉపాధి హామీ వేతనదారుల సమస్యలపై నరేగా అధికారులతో మంత్రి నారా లోకేష్ గురువారం సమీక్షించారు. ఉపాధి హామీ వేతనదారుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి..

06/09/2017 - 01:09

గుంటూరు, జూన్ 8: అనంతపురం - అమరావతి రాజధాని ఎక్స్‌ప్రెస్ హైవేకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. దేశం మొత్తంగా రెండో ఎక్స్‌ప్రెస్ హైవే అయిన ఈ రహదారి నిర్మాణం ఖర్చు రూ. 27 వేల కోట్లను కేంద్రం భరిస్తుందని, భూ సేకరణకు అయ్యే మరో రూ. 25 వేల కోట్లను రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు.

06/09/2017 - 01:09

అమరావతి, జూన్ 8: తన నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఆయా ప్రభుత్వాలు తమ సొంతవిగా ప్రచారం చేసుకుంటున్నందున, ఇకపై తానే విస్తృతంగా వాటిని ప్రచారం చేసుకోవాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని, ప్రచారంతో పల్లెలలో పాగా వేయాలని భావిస్తోంది.

06/09/2017 - 01:05

అమరావతి, జూన్ 8: ‘నేను చంద్రబాబు మాదిరిగా పొద్దునో మాట, రాత్రికోమాట మాట్లాడను. ప్రత్యేక హోదా సాధించడంలో ఆయన విఫలమయ్యారు. తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రం నుంచి బయటకొస్తామని ఎందుకు చెప్పడం లేదు? అందుకే మేం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. కేంద్రంపై ఒత్తిడి చేస్తాం. ఏప్రిల్‌లో జరిగే పార్లమెంటు సెషన్ వరకూ వేచి చూస్తాం.

06/09/2017 - 01:04

గుంటూరు, జూన్ 8: పొగాకు పంటను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చి అదనంగా 5 నుంచి 28 శాతం పన్నును విధించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం పొగాకు రైతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని, తక్షణం జిఎస్‌టి నుంచి పొగాకును మినహాయించాలని ఇండియన్ టుబాకో అసోసియేషన్.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తిచేసింది.

06/09/2017 - 01:03

విజయవాడ, జూన్ 8: రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూలులో ఉన్న ఏపిఎస్‌ఆర్‌టిసి ఇంకా అధికారికంగా విడిపోలేదు.. తెలంగాణా ఆర్‌టిసి పేరిట బస్సులు నడుస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు.. హైదరాబాద్‌లో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన 14 ఆస్తుల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలాబిడే కమిటీ నివేదిక వెలుగు చూడలేదు..

06/09/2017 - 01:03

విజయవాడ, జూన్ 8: రాష్టప్రతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన దృష్ట్యా జూలై 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో జరగాల్సిన భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశాలు జరిగే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

06/08/2017 - 02:19

అమరావతి, జూన్ 7: మంగళవారం 20 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షం వల్ల వెలగపూడి అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్షనేత జగన్ చాంబరులో నీళ్లు ప్రవేశించిన వైనం, ప్రభుత్వ-ప్రతిపక్షాల మధ్య మరో రాజకీయ యుద్ధానికి తెరలేపింది.

06/08/2017 - 02:18

కూచిపూడి, జూన్ 7: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నాట్యంలో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ ఎం పద్మ తెలిపారు. కూచిపూడి నాట్యారామం, రాష్ట్ర, భాష, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కృష్ణాజిల్లా కూచిపూడిలో నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య గురుశిక్షణ కార్యక్రమాలను ఆమె బుధవారం పరిశీలించారు.

06/07/2017 - 03:11

మదనపల్లె, జూన్ 6: బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన మల్లకుంట రాణెమ్మ (52) మృతి చెందింది. వారం రోజులుగా తమ తల్లిని ఇండియాకు రప్పించాలని ఆమె కుమారులు ఏజెంట్లను వేడుకున్నా పట్టించుకోలేదని, దీంతో అక్కడ వేధింపులకే తమ తల్లి మృతి చెందిందని, తమ తల్లి మృతదేహాన్ని మదనపల్లెకు రప్పించాలని, ఇందుకు బాధ్యులైన ఏజెంట్‌లపై చర్యలు తీసుకోవాలని మంగళవారం మదనపల్లె రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Pages