S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/05/2017 - 04:21

విజయవాడ, జూన్ 4: ఆయా రాష్ట్రాల్లో ప్రజలచే తిరస్కరణకు గురైన నేతలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వాగ్దానాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెనూ) కెఇ కృష్ణమూర్తి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విభజన బిల్లులోనే ప్రత్యేక హోదాకి చట్టబద్ధత కల్పించేదని తెలిపారు.

06/05/2017 - 04:20

విజయవాడ, జూన్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక హోదాను కోరేవారిని ప్రగతి నిరోధకులుగా అభివర్ణిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు హోదా ఏవిధంగా ప్రగతి నిరోధకమో ప్రజలకు వివరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ఏర్పాటు చేసిన సభకు ఎవరూ వెళ్లవద్దని చెప్పడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమన్నారు.

06/05/2017 - 04:19

విజయవాడ, జూన్ 4: గుంటూరులో జరిగిన ప్రత్యేక హోదా సాధన భరోసా సభలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కార్యకర్తల ఘన స్వాగతం లభించింది. అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా మార్గంమధ్యలో పలుచోట్ల నల్లజెండాలు, ప్లకార్డులతో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

06/05/2017 - 03:05

విజయవాడ, జూన్ 4: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించి వారిలో భరోసా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మూడోరోజు నవ నిర్మాణ దీక్షపై ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.

06/04/2017 - 02:29

అమరావతి, జూన్ 3: ఆరుపదుల వయసులో అలుపెరుగని రాజకీయ బాటసారి. యంత్రాంగాన్నీ పరిగెత్తించే పని రాక్షసుడు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ నిధులు తెచ్చుకునే లౌక్యుడు. దారి తప్పుతున్న తమ్ముళ్లను అదుపు చేస్తూనే, ప్రత్యర్థులను ఊహించని దాడితో ఉక్కిరిబిక్కిరి చేసే యోధుడు. విభజన కారణంగా అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రపంచపటంలో నిలబెట్టాలని నిరంతరం పరితపిస్తున్న ప్రజాధినేత.

06/04/2017 - 01:45

విజయవాడ, జూన్ 3: గ్లోబల్ డ్రోన్ హబ్‌గా ఏపీని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ప్రతినిధులతో శనివారం సమావేశమై డ్రోన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విశాఖలో డ్రోన్ తయారీ, పరిశోధన, నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఓనీ ప్రెజంట్ సంస్థ ముందుకొచ్చింది.

06/03/2017 - 01:07

విజయవాడ, జూన్ 2: రాష్ట్ర చరిత్రలో జూన్ రెండోతేదీ చీకటి రోజు. జీవితంలో మరువరాని, మరచిపోలేని రోజు. అయితే తెలుగువారిని అడ్డగోలుగా చీల్చిన సోనియాగాంధీ పుట్టిల్లు ఇటలీకి మాత్రం స్వాతంత్య్రం వచ్చిన రోజని సిఎం చంద్రబాబు ఆవేదనతో చెప్పారు. ‘కష్టాలున్నాయని దిగులుపడితే సమస్యల సుడిగుండంలో పడిపోతాం. అందుకే కష్టాలను సవాల్‌గా స్వీకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నా’ అన్నారు.

06/03/2017 - 01:06

రాజమహేంద్రవరం, జూన్ 2: రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ (గుడా) పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. ఇప్పటివరకు గుడాకు సంబంధించిన విధి విధానాలు ఖరారు కాలేదు. ఎక్కడ నెలకొల్పుతారో స్పష్టత లేదు. సిబ్బంది నియామకమూ జరగలేదు. కేవలం ఇద్దరు అధికార్లు నియమితులుకాగా వారు పరాయి పంచన కాలక్షేపం చేస్తున్నారు.

06/03/2017 - 01:04

విజయవాడ, జూన్ 2: పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్, గిడ్డంగుల శాఖలు సమన్వయం చేసుకుంటూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. మిర్చి, పసుపు కొనుగోలును నెలాఖరు వరకూ పొడిగించడంతోపాటు, కల్పిస్తున్న అదనపు గిట్టుబాటు ధర సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

06/03/2017 - 01:03

విశాఖపట్నం, జూన్ 2: విశాఖలో పెద్దఎత్తున జరుగుతున్న భూదందాపై ఆర్ అండ్ బి మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన నవ నిర్మాణ దీక్షకు హాజరైన అయ్యన్న విశాఖలో భూకబ్జాలపై చేసిన వ్యాఖ్యలతో అధికారులు, ప్రజా ప్రతినిధులు అవాక్కయ్యారు. విశాఖలో ఎన్‌ఆర్‌ఐ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు.

Pages