S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/21/2017 - 01:10

విజయవాడ, ఏప్రిల్ 20: ఎపి స్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులోకి మరో ఐదుగురు మంత్రులు సభ్యులుగా చేరారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పితాని సత్యనారాయణ, అమరనాథ్ రెడ్డి, నారా లోకేష్‌లకు చోటు కల్పించారు. ఇప్పటికే సభ్యులుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఉన్నారు.

04/21/2017 - 01:10

విజయవాడ, ఏప్రిల్ 20: రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైకాపా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

04/21/2017 - 01:09

విజయవాడ, ఏప్రిల్ 20: ముగ్గురు ఐఎఎస్‌లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్‌ను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. విశాఖ మున్సిపల్ కమిషనర్ హరినారాయణ్‌కు వుడా వీసీగా, తుడా సెక్రటరీ మాధవీలతకు తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

04/21/2017 - 01:09

అమరావతి, ఏప్రిల్ 20: రాష్ట్రంలో పెరిగిపోతున్న సిమెంట్ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ కంపెనీలు రింగయి ధరలు పెంచుతున్నారన్న వార్తలను సీరియస్‌గా తీసుకున్న బాబు, ధరల నియంత్రణపై దృష్టి సారించాలని మంత్రులను ఆదేశించారు. సిమెంట్ ధరల పెరుగుదల వల్ల గృహనిర్మాణంపై మరింత భారం పడుతుందని వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న బాబు..

04/21/2017 - 01:08

మదనపల్లె, ఏప్రిల్ 20 : వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత ప్రియుడి సహకారంతో కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తుండగా, చూస్తుండలేకపోయిన స్థానికులు వారిద్దరికీ దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం రాత్రి మదనపల్లె పట్టణ శివారుప్రాంతంలో చోటుచేసుకుంది. చిత్తూరుజిల్లా మదనపల్లె రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన భాగ్యమ్మకు ఒక కుమార్తె ఉంది.

04/21/2017 - 01:07

విశాఖపట్నం, ఏప్రిల్ 20: ఝూర్‌ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ భూ ఉపరితలంపై అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఒకటి,రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది.

04/21/2017 - 01:06

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 20: నమ్మకంగా ఒకరికి ఇచ్చిన రూ.14 లక్షల బాకీ వసూలు కాకపోవడంతో మనస్తాపానికి గురైన దంపతులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

04/20/2017 - 05:22

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 19: మన్యం ప్రాంతంలో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది..వేసవికి ముందే తాగునీటి కొరత తలెత్తింది. పోలవరం ముంపు మండలాల్లో తాగునీటి పధకాలు మూలనపడ్డాయి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల ద్వారా కోట్ల నిధులు ఖర్చు పెట్టిన వైనం కాస్తా నిరుపయోగంగానే మారింది. ఏటికేడాది తాగునీటి సమస్యలు జఠిలంగా మారుతున్నా పట్టించుకుంటోన్న పరిస్థితి కన్పించడంలేదు.

04/20/2017 - 05:21

శ్రీకాకుళం, ఏప్రిల్ 19: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు లేలేత భానుడి కిరణాలతో అటు ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యకర ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ విదేశీయుడి నమ్మకం. సూర్యుడు అన్ని ప్రాంతాలకు మార్గదర్శకుడని,సాంకేతికతకు మూలాధారమని రొమేనియా దేశానికి చెందిన మానసిక శాస్త్ర నిపుణుడు స్ట్ఫోన్ సూర్యనమస్కారాలు నేర్చుకునేందుకు అరసవల్లి వచ్చారు.

04/20/2017 - 05:02

భీమవరం, ఏప్రిల్ 19: పాడి పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాడి రైతుకు భరోసాగా ఉండాలని నిర్ణయించింది. పశువులను పెంచే రైతుకు సౌకర్యాలు కల్పిస్తేనే అటు వ్యవసాయం ఇటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పనులు ఉపాధి హామీ నిధులతో చేసుకునే అవకాశం కల్పించింది.

Pages