S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/17/2017 - 03:26

బొబ్బిలి, ఏప్రిల్ 16: విజయనగరం జిల్లా, బొబ్బిలి పట్టణానికి సమీపంలో ఉన్న గున్నతోటవలస గ్రామం వద్ద ఆదివారం ఫైనాన్స్ వ్యాపారి జగన్మోహనరావుపై పశ్చిమ బెంగాల్ ఖరగ్‌పూర్‌కు చెందిన కేశవరావు తుపాకీతో దాడి చేసి, కాల్చి తీవ్రంగా గాయపర్చాడు. జగన్మోహనరావు ఉదయం వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి కేశవరావు కాల్చాడు. జగన్మోహనరావు వీపులో బుల్లెట్ దిగడంతో కుప్పకూలాడు.

04/16/2017 - 07:59

పోలవరం, ఏప్రిల్ 15: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కాంట్రాక్టు ఏజన్సీని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎందుకు రద్దుచేశారో జగన్, కెవిపి రామచంద్రరావులు చెప్పాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండు చేశారు.

04/16/2017 - 07:41

విజయవాడ, ఏప్రిల్ 15: ప్రపంచంలో మరే దేశంలోనూ జరగనన్ని రోడ్డు ప్రమాదాలు మన దేశంలో జరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీటి నివారణపై తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏనాడో అటకెక్కిన ట్రాఫిక్ నియమ నిబంధనలను ఇక కఠినంగా అమలు చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చర్యలు తీసుకున్నారు.

04/16/2017 - 06:43

బిపిఎల్ స్థాయిలో రూ.500 కోట్లు విడుదల
గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో చంద్రబాబు

04/16/2017 - 06:39

అధినేత హెచ్చరికలు బేఖాతరు
ధిక్కారంపై బాబు ఆగ్రహం
అయినా ఆచితూచి చర్యలు
వేటేస్తే దళితులు వ్యతిరేకించే అనుమానం
దళిత సంఘాలతో చర్చిస్తున్న ఎంపి
నేడు సిఎంను కలిసే అవకాశం?

04/15/2017 - 04:05

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 14: డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చడం, జల విద్యుదుత్పత్తితోపాటు జల రవాణాకు పోలవరం ప్రాజెక్టు కీలకం కానుంది. కాకినాడ-పుదుచ్ఛేరి జల రవాణాకు కాల్వ నిర్మాణం ఈ బృహత్ ప్రాజెక్టులో భాగం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగవ జల రవాణా మార్గానికి ఉపయోగపడేలా పోలవరం కాలువలను డిజైన్ చేశారు.

04/15/2017 - 04:03

విజయవాడ, ఏప్రిల్ 14: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమం జరిగిన వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.

04/15/2017 - 04:00

అనంతపురం, ఏప్రిల్ 14: అనంతపురం జిల్లాలో ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. గత 15 రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈ నెలలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. కనిష్టంగా 26 డిగ్రీలు నమోదవుతోంది. ఎండలకు గత పది రోజుల్లో 10 మందికి పైగా వడదెబ్బ బారిన పడి మృత్యువాత పడ్డారు.

04/15/2017 - 03:58

శ్రీశైలం, ఏప్రిల్ 14: శ్రీశైలం మహాక్షేత్రంలోలో కొలువైన శ్రీభ్రమరాంబదేవి అమ్మవారి వార్షిక కుంభోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం, శుక్రవారం అమ్మవారికి సాత్విక బలి సమర్పించి కుంభోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నం రాశిని సాత్విక బలిగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

04/15/2017 - 03:23

అమరావతి, ఏప్రిల్ 14: తన ప్రభుత్వ పనితీరుపై నిఘా సంస్థలు ఇస్తున్న నివేదికలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి చెందడం లేదా? ఇంకా క్షేత్రస్థాయి వాస్తవాల కోసం పరితపిస్తున్నారా? వేల కోట్లు ఖర్చుచేసి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి వెళ్లడం లేదని భావిస్తున్నారా? అసలు జనం మదిలో తన పాలనపై ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా?..

Pages