S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/25/2017 - 05:18

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 24: ప్రతిపక్ష నేత జగన్ ఆరోపిస్తున్నట్లు అగ్రిగోల్డు డైరెక్టర్ దినకర్ దగ్గర ఆస్తులు కొనుగోలు చేసింది వాస్తవమేనని, అయితే వాటిని న్యాయబద్ధంగా కొనుగోలు చేశామని ఇందులో ఎవరిని భయపెట్టలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

03/25/2017 - 05:17

మంగళగిరి, మార్చి 24: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఆరోపించారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణం మీడియా పాయింట్‌లో శుక్రవారం శ్రీకాంత్‌రెడ్డితో పాటు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కె శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడారు.

03/25/2017 - 05:17

గుంటూరు, మార్చి 24: ఓ వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, మరోవైపు తెచ్చిన అప్పులను చెల్లించలేక మిర్చిరైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లైనా లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు మిర్చియార్డును సందర్శించిన జగన్ అక్కడ ఉన్న మిర్చిరైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

03/25/2017 - 04:29

గుంటూరు (పట్నంబజారు), మార్చి 24: నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్‌కు తాను ఎప్పుడో రాజీనామా చేశానని, తనకు ఫెడరేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని సినీనటి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యినిర్వాహక కార్యదర్శి కవిత స్పష్టంచేశారు.

03/25/2017 - 04:28

విజయవాడ (పటమట), మార్చి 24: నవ్యాంధ్రలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై అధికార పక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారని, ప్రత్యేక హోదా, కరువు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల సహా ఏ ఒక్క అంశాన్ని ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని ఆమె విమర్శించారు.

03/25/2017 - 04:27

విజయవాడ, మార్చి 24: మినీ థియేటర్లు నిర్మించి తెలుగు రాష్ట్రాల్లో వై స్క్రీన్స్ సంస్థ సంచలనం సృష్టిస్తున్నది. 2016లో ప్రారంభమైన ఈ సెంటర్లు తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం తీసుకునివచ్చే మార్గాన్ని చూపించింది.

03/25/2017 - 04:26

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 24: ‘వచ్చే ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే మీకు రూ.15 వేల వేతనం కచ్చితంగా ఇప్పిస్తా’నని విఆర్‌ఏలకు వైసిపి అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా విఆర్‌ఎ నాయకులు, ఆందోళన చేస్తున్న వారు హర్షధ్వానాలతో నిరసన ప్రాంగణాన్ని హోరెత్తించారు.

03/25/2017 - 04:25

విజయవాడ (క్రైం), మార్చి 24: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై క్షేత్ర స్థాయిలో అధ్యాయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పడింది. పోలీసుశాఖకు చెందిన డిఎస్పీ స్థాయి అధికారులతోపాటు రవాణా, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అధారిటీ, తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన ఈ కమిటీ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈమేరకు రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు.

03/25/2017 - 04:24

విజయవాడ, మార్చి 24: ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అచ్చెన్నాయుడు బాలకృష్ణ సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. అగ్రిగోల్డ్‌పై జరుగుతున్న చర్చలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై జగన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ప్రతిపక్షానికి శుక్రవారం అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. మంత్రి ప్రత్తిపాటి సవాల్‌ను జగన్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.

03/25/2017 - 04:23

విజయవాడ, మార్చి 24: శ్రీకాకుళం జిల్లా పలాస సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్ శివాజీకి మరోసారి అవమానం ఎదురైంది. శుక్రవారం సమావేశాలకు హాజరవుతున్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సిబ్బంది ఎమ్మెల్యే శివాజీని అసెంబ్లీ లోపలకి అనుమతించలేదు. అయితే ఐడి కార్డు చూపించి తనిఖీ చేసిన తర్వాతే ఆయనను లోనికి అనుమతించారు.

Pages