S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/24/2017 - 02:13

విజయవాడ (పటమట) మార్చి 23: ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారపక్ష ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కుని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

03/24/2017 - 02:12

గుంటూరు, మార్చి 23: శాసనసభలో అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై విక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని, ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్‌ను జగన్ స్వీకరించి తన నిజాయితీని నిరూపించుకోవాలని పలువురు టిడిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

03/23/2017 - 08:45

అమరావతి, మార్చి 22: ఎవరైనా ఇంట గెలిచి రచ్చ ఓడుతుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇంట ఓడి రచ్చ గెలిచారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, తన సొంత జిల్లా కడపలో సొంత బాబాయిని గెలిపించుకోలేని నేతగా అపఖ్యాతి మూటకట్టుకున్న జగన్..

03/23/2017 - 08:44

తిరుపతి, మార్చి 22: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన వేలూరుకి చెందిన పద్మనాభం (65) అనే భక్తుడిపై గత రెండు రోజుల క్రితం ఆలయ మహాద్వారం సమీపంలో ఉన్న స్కానింగ్ కేంద్రం వద్ద టిటిడి విజిలెన్స్, ఎస్పీఎఫ్ సిబ్బంది దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

03/23/2017 - 08:44

రాజాం, మార్చి 22: శ్రీకాకుళం జిల్లా రాజాం కరూర్ వైశ్యా బ్యాంక్‌లో అప్రైజర్ కోటి 33 లక్షల 55 వేల రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా నిలిచాడు. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న వారు వాయిదాలు కట్టక పోవడంతో వారు తాకట్టు పెట్టిన బంగారాన్ని బుధవారం పరిశీలించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో బ్యాంక్ మేనేజర్ చంద్రవౌళి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

03/23/2017 - 08:41

గుంటూరు, మార్చి 22: శాసనసభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలి..క్రమశిక్షణతో పదిమందికి ఆదర్శంగా నిలవాలి తప్ప అడుగడుగునా అవరోధాలు కల్పించటం మంచి సాంప్రదాయం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు హితోపదేశం చేశారు. ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి సందేశంతో పాటు ప్రతిజ్ఞ చేయించేందుకు బుధవారం ఉద్యుక్తులైన సమయంలోనే..

03/23/2017 - 08:40

అమరావతి, మార్చి 22: అభ్యర్థి ఎంపిక, సమన్వయలోపం అభ్యర్థి మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిసి తన పరువు తీశాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి జరిగిన నెల్లూరు జిల్లా పార్టీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

03/23/2017 - 08:39

విజయవాడ, మార్చి 22: అప్పులు చేసేది సంపదను సృష్టించేందుకేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కేంద్ర నిధుల మీద ఆధారపడటమన్నది ఆర్థిక సంబంధాల్లో నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు. రాష్ట్ర శాసన మండలిలో బడ్జెట్‌ను ఆమోదింప చేసేందుకు, సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలపై బుధవారం తన ప్రసంగంలో ప్రస్తావించారు.

03/23/2017 - 07:19

గుంటూరు, మార్చి 22: ప్రపంచ జలవనరుల దినోత్సవం ఏపి శాసనసభలో జగడానికి కారణమయింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది.. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి మాట్లాడేందుకు రెండు నిముషాల వ్యవధి కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. అందుకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు నిరాకరించారు. సభా నాయకుడు ప్రసంగించిన అనంతరం అనుమతి ఉంటుందన్నారు.

03/23/2017 - 07:18

విశాఖపట్నం, మార్చి 22: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు సూచనలు హర్షించతగ్గ పరిణామమని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామమందిర నిర్మాణానికి సంబంధించి కోర్టు వెలుపల చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోత్తమ న్యాయస్థానం సూచించడాన్ని ఆయన స్వాగతించారు.

Pages