S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/21/2017 - 03:14

మంత్రాలయం, మార్చి 20: ముంబాయి మహానగరంలోని జోగేశ్వర ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీరాఘవేంద్రస్వామి మఠాన్ని పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు సోమవారం ప్రారంభించారు. రూ. 3 కోట్లతో మఠాన్ని నిర్మించారు. మఠంలో రాఘవేంద్రస్వామి మృత్తిక బృందావనం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాలు, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగాలను ఏర్పాటుచేశారు.

03/21/2017 - 03:12

న్యూఢిల్లీ, మార్చి 20: కరవుతో అష్టకష్టాలుపడుతున్న ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు వి విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. విజయసాయి సోమవారం రాజ్యసభలో ఏపిలో నెలకొన్న కరవు గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో వరుసగా రెండో సంవత్సరం కరవు నెలకొందన్నారు.

03/21/2017 - 02:14

మడకశిర, మార్చి 20: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా అన్న అంశంపై రెండు కోట్ల మందితో ప్రజాబ్యాలెట్ నిర్వహించనున్నట్లు పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జిల్లా మడకశిరలో ప్రత్యేక హోదా పై జరిగిన ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని రఘువీరా ప్రారంభించారు.

03/21/2017 - 02:12

చిత్తూరు, మార్చి 20: తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిడిఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం విజయం సాధించారు. చిత్తూరులో తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 9 మంది అభ్యర్థులు ఎన్నికల బరి లో నిలవగా ప్రధానంగా పిడిఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం, టిడిపి అభ్యర్థి వాసుదేవనాయుడుల మధ్యనే పోటి నెలకొంది.

03/21/2017 - 02:10

అనంతపురం, మార్చి 20: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యా య ఎమ్మెల్సీగా కడప జిల్లాకు చెందిన కత్తి నరసింహారెడ్డి విజయబావుటా ఎగురవేశారు. ఆయ న తన సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై 3,763 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నరసింహారెడ్డికి మొత్తం 9,624 ఓట్లు వచ్చాయి. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కత్తి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 5,861 ఓట్లు పోలయ్యాయి.

03/21/2017 - 02:08

విశాఖపట్నం, మార్చి 20: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గానికి జరిగిన ఓట్ల లెక్కింపు టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి మాధవ్, ప్రోగ్రెసివ్ డెమొక్రెటివ్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్థి అజ శర్మ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. తొలి ఫలితంలో మాధవ్ సుమారు 701 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కించారు.

03/21/2017 - 02:07

కర్నూలు, మార్చి 20: ఎవరైనా విజయం సాధిస్తే ఆనందంతో ఉత్సవాలు చేసుకుంటారు. ఓడినవారు అన్నీ పక్కన పెట్టి ఇంటి కి వెళ్లి మదనపడతారు. అయితే కర్నూలు లో సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయి న తరువాత అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది. విజయం సాధించిన టిడిపి లో భయం కనిపించగా వైకాపాలో ఆనం దం వెల్లివిరిసింది. ఇందుకు కారణం టిడిపి ఊహించినట్లుగా ఓట్లురాకపోవడం, వైకాపా అనుకున్న సంఖ్య కన్నా అధిక ఓట్లు రావడమే.

03/21/2017 - 02:06

హైదరాబాద్, మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌లో పెడన- నూజివీడు- విస్సన్నపేట రహదారి విస్తరణ పనుల కాంట్రాక్టు తమకే కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్‌ను ఉమ్మడి హైకోర్టు తొసిపుచ్చింది. జస్టిస్ చల్లా కోదండరామ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కనీసం తమ దరఖాస్తును పరిశీలనకు సైతం ప్రభుత్వం పరిగణించలేదని సంస్థ ఆరోపించింది.

03/21/2017 - 02:05

ఆలమూరు, మార్చి 20: దేశంలోనే అత్యంత ఖరీదైన పశుసంపద తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండ లం గుమ్మిలేరు రైతుల సొం తం. ప్రతి ఏడాది రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించే పశువుల పోటీలు, పాల పోటీలు, అందాల పోటీల్లో మొదటి రెండు స్థానాలు ఈ గ్రామానివే. అందుకే ఈ గ్రామంలోని రైతులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రామం నుండి పశువీర్యాన్ని సేకరించి గుంటూరుకు వైద్యులు తరలిస్తూ ఉంటారు.

03/21/2017 - 02:03

తిరుపతి, మార్చి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిటిడి నిత్యాన్నదాన పథకానికి 25లక్షల రూపాయ లు విరాళం ఇచ్చారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బ్రహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్‌కు మంగళవారం తొలి జన్మదినం కావడంతో టిటిడి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.25 లక్షలు వారి కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చినట్లు తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు.

Pages