S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/20/2017 - 04:26

గుంటూరు, మార్చి 19: కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో బుగ్గవాగు ఆధునీకరణ పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి ఆదివారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీతో నీరు అందిస్తామని చెప్పారు.

03/20/2017 - 04:24

కర్నూలు, మార్చి 19 : ఫ్యాక్షన్ రక్కసితో అట్టుడికిన ఆళ్లగడ్డ రాజకీయాలు క్రమేణా నంద్యాలకు చేరుతున్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్‌లో నిర్వహించే ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ ప్రత్యర్థులైన భూమా, గంగుల కుటుంబాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయా పార్టీల నేతల ద్వారా తెలుస్తోంది.

03/20/2017 - 04:23

చిత్తూరు/నెల్లూరు, మార్చి 19 : తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును సోమవారం చిత్తూరులోని పివికెఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్నారు. ఈనెల 9న ఈ నియోజకవర్గాల పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు జిల్లాల బ్యాలెట్ బాక్సులను చిత్తూరుకు తరలించారు.

03/20/2017 - 04:23

కడప, మార్చి 19 : కడప జిల్లాలో సోమవారం జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ఫలితాల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని స్థానిక నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. నేడు వెలువడనున్న ఫలితం అధికార, ప్రతిపక్ష పార్టీలకు అగ్నిపరీక్ష లాంటిదని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితాలపై ఇరుపార్టీల నేతల, రాజకీయ విశే్లషకులు అంచనాలు వేస్తున్నారు.

03/20/2017 - 04:22

విశాఖపట్నం, మార్చి 19: ఈ ఏడాది అకాల వర్షాలను ఎదుర్కొనేందుకు ఏపీ ట్రాన్స్‌కో సిద్ధమైంది. ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. తుపానులు, భారీ వర్షాలు, ఈదురుగాలులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

03/20/2017 - 04:22

విజయవాడ, మార్చి 19: కరవు నివారణకు ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు చేపట్టాలని, ఈ నెల 25న అనంతపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అధ్యక్షతన ఒకరోజు సామూహిక దీక్ష చేపడుతున్నట్లు సీనియర్ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

03/20/2017 - 04:21

నెల్లూరు, మార్చి 19: అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఇద్దరు మార్కెటింగ్ డైరెక్టర్లను ఆదివారం నెల్లూరు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెటింగ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న బెజవాడ వీరవెంకట బాబూరావు, కాజ కిషోర్‌లను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు.

03/20/2017 - 04:20

తిరుపతి, మార్చి 19: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్రోహ శక్తులు కుయుక్తులు పన్నుతున్నాయని ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఐక్యంగా నిలిచి కేంద్రానికి అండగా నిలవాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

03/20/2017 - 04:20

అనంతపురం, మార్చి 19 : రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పొగరుబోతు నేత అని అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపి జెసి ఆదివారం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఎంపి జెసి విలేఖరులతో మాట్లాడుతూ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

03/20/2017 - 04:19

విజయనగరం, మార్చి 19: రాష్ట్రంలో సార్వత్రిక విద్య పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 11 జిల్లాల్లో 6.67 లక్షల మంది ఈ పరీక్షను రాసినట్టు వయోజనవిద్య శాఖ డైరెక్టర్ అమ్మాజీరావు తెలిపారు. ఆదివారం ఆయన జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఏడోదశ ప్రాథమిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు.

Pages