S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/18/2017 - 04:29

కర్నూలు/కడప/నెల్లూరు, మార్చి 17: కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వం కోసం శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 99.35 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 1,084 మంది ఓటర్లకు గాను శుక్రవారం 1,077 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడుగురు సభ్యులు ఓటు వేయలేదు.

03/18/2017 - 04:28

కాకినాడ, మార్చి 17: ఎపి ఎంసెట్-2017ను తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్, జెఎన్‌టియుకె రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్ సాయిబాబు తెలిపారు. ఎంసెట్‌ను గత మూడు సంవత్సరాలుగా వరుసగా జెఎన్‌టియుకె నిర్వహిస్తోందన్నారు.

03/18/2017 - 04:26

హైదరాబాద్/విశాఖపట్నం, మార్చి 17: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ విశాఖపట్నంలో లభ్యమైంది. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే పోలీసులు విజయవంతంగా ఈ కేసును ఛేదించారు. ఈస్ట్‌జోన్ పరిధిలోని అంబర్‌పేటలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం కావడం ఇక్కడ కలకలం రేపింది.

03/18/2017 - 04:24

విశాఖపట్నం, మార్చి 17: ఓ వైపు అవినీతి నిరోధక శాఖ అక్రమార్కులపై నిఘా వేసి, వారి అక్రమార్జనపై దాడులు జరుపుతున్నా, అవినీతిపరులు మాత్రం ఏమాత్రం వెరవకుండా అక్రమ సంపాదనను కొనసాగిస్తునే ఉన్నారు. విశాఖలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముమ్మన రాజేశ్వరరావు ఆస్తులపై ఏసిబి అధికారులు శుక్రవారం జరిపిన దాడుల్లో దాదాపూ పదిహేను కోట్ల అక్రమార్జన వెలుగులోకి వచ్చింది.

03/18/2017 - 04:21

అనంతపురం, మార్చి 17: పోలీసు సిబ్బంది సమస్యల సత్వర పరిష్కారం కోసం అనంతపురం జిల్లా పోలీసులు వినూత్న రీతిలో సాంకేతికను వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సన్నిహితం’ పేర మొబైల్ యాప్‌ను జిల్లా పోలీసు శాఖ రూపొందించింది. జిల్లా ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన ఈ యాప్‌ను అనంతపురం పోలీస్ రేంజ్ డిఐజిజె.ప్రభాకరరావు శుక్రవారం ఆవిష్కరించారు.

03/18/2017 - 02:10

అమరావతి, మార్చి 17: ‘ఉద్యోగాల కోసం ప్రయత్నించటం కాదు., అలా ప్రయత్నించేవారికి ఉద్యోగావకాశం కల్పించారు. ఇంటిపట్టున ఉంటూ నే వస్తూత్పత్తితో ఆదాయం సంపాదించే వనరును సృష్టించారు. వేలాదిమందికి ఉపాధి చూపారు. రాష్ట్రంలో అంకుర సంస్థల విధానానికి శ్రీకారం చుట్టి మీరు ఎంతో మేలు చేశారు’ అంటూ పలువురు యువకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

03/18/2017 - 02:08

విశాఖపట్నం, మార్చి 17: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకుబాటు, అభివృద్ధి అంశాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/18/2017 - 02:07

హైదరాబాద్, మార్చి 17: జాతీయ స్థాయిలో బాలికల విద్యా ప్రోత్సాహానికి తీసుకోవల్సిన చర్యలపై ‘కేబ్’ నియమించిన మంత్రుల స్థాయి సబ్‌కమిటీ తొలి సమావేశం శనివారం నాడు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సబ్‌కమిటీకి తెలంగాణ విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా అస్సాం విద్యామంత్రి హేమంత బిశ్వశర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ ఉన్నారు.

03/18/2017 - 02:03

చిత్తూరు, మార్చి 17 : చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఇరువురికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఇఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

03/18/2017 - 00:23

జమ్మలమడుగు, మార్చి 17: రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన నడుస్తోందని వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహనరెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న మూడు జిల్లాల్లో వైకాపాకే మెజారిటీ అభ్యర్థులు ఉన్నారన్నారు.

Pages