S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/17/2017 - 00:25

అమరావతి, మార్చి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ స్వాగతించింది. ఆ మేరకు ప్యాకేజీ చట్టబద్ధతకు కృషి చేసిన ప్రధాని, మంత్రులకు కృతజ్ఞతలు చెబుతూ గురువారం ధన్యవాద తీర్మానం ఆమోదించింది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీ సభలో ఉన్నప్పటికీ తీర్మానాన్ని వ్యతిరేకించింది. ధన్యవాద తీర్మానం ఇలా ఉంది.

03/17/2017 - 00:25

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 16: నవ్యాంద్ర రాజధాని అమరావతి రూపుదిద్దుకున్న నూతన అసెంబ్లీ, మండలి భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ లోపలికి ప్రవేశించే విషయంలో మాత్రం కాస్త అయోమయానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులు లోపలికి వెళ్ళేందుకు తికమకపడిన సందర్భం గురువారం లాబీల్లో కనిపించింది.

03/17/2017 - 00:24

విజయవాడ, మార్చి 16: శాసనసభ సమావేశాల్లో ఐదోరోజైన గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో వైకాపా సభ్యుల నిరసనలతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు అందిస్తున్న అవాస్తవ సమాచారాన్ని ప్రశ్నించేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు ఆరుసార్లు స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. నినాదాల హోరు మధ్య పరిస్థితి అదుపు తప్పటంతో స్పీకర్ కోడెల సభను రెండుసార్లు వాయిదా వేయాల్సివచ్చింది.

03/17/2017 - 00:24

అమరావతి, మార్చి 16: రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని తమ సొంతం చేసుకునేందుకు మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఎవరి వ్యూహాలకు వారు పదునుపెడుతున్నాయి.

03/16/2017 - 08:23

విజయవాడ, మార్చి 15: సైబర్ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు మాస్టర్ కార్డ్ సంస్థ ముందుకొచ్చింది. విశాఖలో ఆవిష్కరణల అభివృద్ధి కేంద్రం (ఇన్నోవేటివ్ డెవలప్‌మెంట్ సెంటర్) ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసింది. బుధవారం రాత్రి విజయవాడ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయిన మాస్టర్ కార్డ్ గ్లోబల్ సిఈవో అజయ్ బోంగా ఎపిలో తమ ప్రణాళికలపై చర్చించారు.

03/16/2017 - 08:18

విజయవాడ, మార్చి 15: భూముల విలువలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ సంస్థలకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు రాజకీయ నేతలు, రాజకీయంగా పలుకుబడి కల్గిన పెద్దలు ఆక్రమిస్తున్న తీరుపై బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో రాజకీయాల కతీతంగా వేడైన చర్చ జరిగింది.

03/16/2017 - 08:17

యలమంచిలి, మార్చి 15: కాపులను బిసిల్లో చేర్చుతానని చంద్రబాబు నాయుడు ఎన్నిక సమయంలో హామీ ఇవ్వడం వల్లే తాము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర కాపుసంక్షే సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. విశాఖ జిల్లా, రాంబిల్లి మండలం గోకివాడలోని బంధువుల ఇంటికి బుధవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు.

03/16/2017 - 08:17

కర్నూలు, మార్చి 15: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధిని ఎన్నుకోవడంలో మహిళా ప్రతినిధుల పాత్ర కీలకంగా మారింది. జిల్లాలో ఉన్న స్థానిక సంస్థల్లో వారే అధికంగా ఉండటంతో మహిళల ఓటు ప్రాధాన్యత సంతరించుకోనుంది. జిల్లాలో మొత్తం 1,084 మంది ఓటర్లు ఉండగా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మృతితో ఒక ఓటు తగ్గింది. మిగిలిన 1,083 ఓట్లలో మహిళలు 624 మంది ఉండగా పురుషులు 559 మంది ఉన్నారు.

03/16/2017 - 08:15

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 15: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపుల్లో పరిశ్రమల రంగానికి భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా పరిశ్రమల రంగానికి చేయూత నిచ్చేందుకు గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో 113.78 శాతం పెరుగుదల కనిపించింది.

03/16/2017 - 07:59

విజయవాడ, మార్చి 15: రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, గృహావసరాల కోసం నీటిని అందించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వివిధ ప్రాజెక్టుల పనులు మరింత వేగవంతం చేసందుకు వీలుగా 2017-18 సంవత్సరం బడ్జెట్‌లో జలవనరుల శాఖకు భారీగా నిధులు కేటాయించారు. 12,770 రూపాయలను కేటాయించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపుల కన్నా 7,978 కోట్ల రూపాయలు అధికం కావడం గమనార్హం.

Pages