S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/23/2017 - 01:49

విజయవాడ, ఫిబ్రవరి 22: రాష్ట్రానికి 14500 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులను సాధించే దిశగా తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ముంబైలో ఫ్యూచర్ డీకోడెడ్ పేరుతో జరుగుతున్న సదస్సులో బుధవారం ఆయన ప్రసంగించారు. దేశంలో తొలి డిజిటల్ నగరంగా విశాఖ ఆవిష్కృతం కానుందని ఆయన తెలిపారు.

02/22/2017 - 12:42

హైదరాబాద్: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన మంత్రి ఛాతి నొప్పికి గురైన విషయం తెలిసిందే. తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించగా అపోలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అందించాక డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. కాగా మంత్రి తిరుమల నుంచి నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరారు.

02/22/2017 - 12:33

విశాఖ : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. మార్చి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే రూ.500 ఫైన్‌తో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా... మొత్తం 16 కేంద్రాల్లో ఆన్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఏయూ వీసీ ఈశ్వర్‌రావు, ఎంసెట్ కన్వీనర్ రంగనాథ్ తెలిపారు. ఏప్రిల్ 19న ఎంసెట్ పరీక్ష జరుగుతుందని వారు తెలిపారు.

02/22/2017 - 12:23

తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు, స్పీకర్‌, మం‍త్రులతో సహా బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత, అల్లుడు అనీల్, మనువళ్లతో కలసి ఆయన మహాద్వారం గుండా ఆలయం లోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు.

02/22/2017 - 04:45

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంగళవారం సూర్యప్రభ, చప్పర వాహనసేవలు జరిగాయి. ఉదయం గంగాదేవి సమేత సోమస్కంద మూర్తి సూర్యప్రభ వాహనంపై, జ్ఞాన ప్రసూనాంబ చప్పరం వాహనంపై ఊరేగారు. మేళతాళాలు, కళాకారుల బృందాలు వెంటరాగా వాహనసేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ట్రస్టుబోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు, ఇ ఓ భ్రమరాంబలు ప్రారంభించారు.

02/22/2017 - 04:29

గుంటూరు, ఫిబ్రవరి 21: పేద బ్రాహ్మణులను ఆదుకున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని, ఆయన రుణం తీర్చుకోలేనిదని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కో ఆర్డినేటర్, అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సిరిపురపు శ్రీ్ధర్, జంధ్యాల రామలింగేశ్వర శాస్ర్తీ కొనియాడారు.

02/22/2017 - 04:27

విజయవాడ, ఫిబ్రవరి 21: ఎపిఎస్‌పిడిసిఎల్ విద్యుత్ విజిలెన్స్ విభాగానికి చెందిన 48 మంది అధికారులు 14 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. విజయవాడ, కంకిపాడు, నూజివీడు, రెడ్డిగూడెం, జి.కొండూరు సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో 216 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు కాగా రూ.14.8 లక్షల జరిమానా విధించినట్టు విజిలెన్స్ ఎస్‌ఇ రవి తెలిపారు.

02/22/2017 - 04:26

అమరావతి, ఫిబ్రవరి 21: భూములకు సంబంధించిన వివరాలను ఇంటి వద్ద నుంచే తెలుసుకునేలా ప్రభుత్వం రూపొందించిన మీ భూమి వెబ్‌సైట్‌కు రైతులు, ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కోట్లాది మంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి తమ సమస్యలు నివృత్తి చేసుకుంటున్నారు. గతంలో తమ భూములు, స్థిరాస్తి వివరాలు తెలుసుకోడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒక్కొక్కప్పుడు రోజులు కూడా గడిచిపోయేవి.

02/22/2017 - 04:26

విశాఖపట్నం (జగదాంబ), ఫిబ్రవరి 21: నచ్చినప్పుడు విధులకు హాజరై, కాసేపు కళాశాలలో గడిపి, ఆ తరువాత ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో బోధనకు వెళ్లిపోతున్నారు కొందరు మెడికల్ ప్రొఫెసర్లు. ఇటువంటి వారి ఆట కట్టించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

02/22/2017 - 04:25

గన్నవరం, ఫిబ్రవరి 21: జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తనను పోలీసులు ఎయిర్‌పోర్టులో నిర్బంధించి, సమావేశానికి హాజరుకాకుండా హైదరాబాద్‌కు తరలించిన ఘటనపై వైకాపాకు చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం 5వ అదనపు సివిల్ జడ్జి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.

Pages