S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/06/2017 - 03:03

విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సదస్సులను తలదనే్నలా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయిస్తోంది. ఈమేరకు అధికారులు శ్రమిస్తున్నారు. కృష్ణానదీ తీరం ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరిగే సదస్సుకు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

02/06/2017 - 02:58

అమరావతి, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ప్రతిపక్ష నేత పాత్రపై పోటీ మొదలయింది. ఇప్పటివరకూ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీపై ఒంటరి పోరాటం చేస్తున్న నేపథ్యంలో కొత్తగా జనసేన అధిపతి పవన్‌కల్యాణ్ తెరపైకి రావడంతో పాటు ప్రజల మధ్యకు వెళ్లేందుకు కార్యక్రమాలు రూపొందించుకోవడంతో ఇద్దరు నాయకుల మధ్య పోటీ పెరిగినట్టయింది.

02/06/2017 - 02:55

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: కూనేరు వద్ద సంభవించిన రైలు ప్రమాద సంఘటనలో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. కీలకమైన ఆధారాలు ఒక్కొక్కటీగా లభిస్తున్నాయి. దర్యాప్తు లోతుగా జరుగుతున్నందున త్వరలోనే మిస్టరీ వీడనుంది. రైలు ట్రాక్ మారినపుడు కలిపే జాయింట్ సమీపాన పట్టా విరిగిపోవడంతోనే ప్రమాదం జరిగిందనేది స్పష్టమవుతోంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.

02/06/2017 - 02:44

ఒంగోలు/చీరాల, ఫిబ్రవరి 5: అనంతపురంలో తెలుగు తమ్ముళ్లు ఒక మహిళపై దాడి చేసిన సంఘటన మరువక ముందే ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు, మరికొంతమంది ఓ జర్నలిస్టుపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన చీరాల గడియార స్తంభం వద్ద ఆదివారం పట్టపగలు జరిగింది. వేటపాలెంకు చెందిన నాగార్జునరెడ్డి పట్టణంలోని చీరాల గడియార స్తంభం కూడలిలో మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా అతడిని ఓ కారు ఢీకొంది.

02/06/2017 - 02:42

తిరుపతి, ఫిబ్రవరి 5: ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఎపి ఎన్‌జిఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నందున ఉద్యోగ సంఘాలు నూతన జెఎసి ఏర్పాటు చేసుకున్నాయ.

02/06/2017 - 02:35

విజయవాడ, ఫిబ్రవరి 5: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని మార్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వ తేదీ వరకూ దేశంలో ఆర్థిక సంవత్సరంగా పాటిస్తున్నారు. అయితే దీన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఉండేలా మార్పుచేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదన చేసింది. ఇది కార్యరూపం దాల్చాల్సి ఉంది.

02/05/2017 - 04:55

విజయవాడ, ఫిబ్రవరి 4: రాష్ట్రంలోని ట్రెజరీ కార్యాలయాలకు భద్రత పేరిట కోట్లాది రూపాయలు వృథాగా ఖర్చు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. గతంలో ఒక్కో జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కనీసం వంద కోట్ల రూపాయలకు తగ్గకుండా రిజిస్ట్రేషన్ స్టాంపులు నిలువ ఉండేవి. అలాగే వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కూడా ఇక్కడే భద్రపరిచేవారు. దీంతో ప్రతి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నిత్యం మూడు షిఫ్ట్‌ల్లో...

02/05/2017 - 04:50

చిత్తూరు, ఫిబ్రవరి 4: వరుస హత్యలకు పాల్పడుతూ భయోత్పాతం సృష్టిస్తున్న కరడుగట్టిన నేరగాడు మధుకర్‌రెడ్డి (32)ని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తంబళ్ళపల్లి మండలం దిగువపల్లెకు చెందిన మధుకర్‌రెడ్డి నాలుగు హత్యకేసుల్లోనూ, పలు దోపిడీ కేసుల్లోనూ నిందితుడు. స్వగ్రామంలోనే ఒక హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ, గతంలో పోలీసుల కన్నుగప్పి పారిపోయాడు.

02/05/2017 - 04:46

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) ఫిబ్రవరి 4: ఉత్సాహపూరిత వాతావరణంలో ఆహ్లాదకరంగా సాగిన నేవీ విన్యాసాల వీక్షణ మధురానుభూతిని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రానికి పెద్ద ఆస్తులని చెబుతూ, రానున్న రోజుల్లో కృష్ణా నదిపై మరో రెండు వంతెనలు నిర్మిస్తామన్నారు.

02/05/2017 - 04:47

హిందూపురం, ఫిబ్రవరి 4: హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు ముదురుపాకాన పడ్డాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఎ కనుమూరి శేఖర్ తీరుపై అసంతృప్తవాదులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా శనివారం ఇద్దరు జడ్పీటీసీలు పదవులకు రాజీనామా చేశారు. పార్టీ అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని బాలయ్య హెచ్చరించినా అసంతృప్తవాదులు వెనక్కు తగ్గలేదు.

Pages