S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/04/2017 - 05:02

రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలోని అనివెట్టి మండపంలో ఉత్సవ మూర్తులకు పూజాదికాలు నిర్వహిస్తున్న అర్చకులు

02/04/2017 - 04:50

శ్రీకాకుళం, ఫిబ్రవరి 3: ఆరోగ్యం..ఐశ్వర్యం..నేత్రానందం..ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి మహాక్షీరాభిషేక దర్శనం! సూర్యజయంతి పర్వదినం పురస్కరించుకుని ఆదిత్యుని మూలవిరాట్‌కు భక్తుల క్షీరాభిషేక సేవలు చూసిన నయనాలే నయనాలు. ఏడాదికోసారి రథసప్తమి పర్వదినాన సూర్యభగవానుని నిజరూపదర్శనం భక్తులకు మరపురాని అనుభూతిని కలిగించి పరవశింపజేసే ఘట్టం ఈ శుభ సమయం.

02/04/2017 - 04:48

అమరావతి, ఫిబ్రవరి 3: తెలుగుదేశం ఉత్తరాధికారి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజకీయ భవితవ్యంపై ఇప్పటివరకూ అనధికారికంగా జరుగుతున్న చర్చలు, అనుమానాలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరదించారు. ఆయనను క్యాబినెట్‌లో తీసుకుంటున్నట్టు తెలంగాణ పార్టీ నేతలకు స్పష్టం చేయడంతో లోకేశ్ ఇక క్యాబినెట్‌లోకి రావడం ఖాయమని తేలిపోయింది.

02/04/2017 - 04:43

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: విభజిత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థల పెట్టుబడుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరిందన్నారు.

02/04/2017 - 04:35

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో గత కొనే్నళ్లుగా వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసుల క్రమబద్ధీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. ఈ మేరకు జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించారు.

02/04/2017 - 04:25

అమరావతి, ఫిబ్రవరి 3: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుతో రాష్ట్ర రాజధాని నగరాలైన గుంటూరు-కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. పై స్థాయిలో ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తుండటంతో, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అసహనంతో ఉన్నారు. చివరకు వీరి గోడు వెళ్లబోసుకునేందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయం వేదికగా మారింది.

02/04/2017 - 04:24

గుంటూరు, ఫిబ్రవరి 3: నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరుతో కొత్తగా రిజిస్ట్రేషన్ జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. తుళ్లూరులో తొలిసారిగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కెఇ శుక్రవారం ప్రారంభించారు.

02/04/2017 - 04:23

అమరావతి, ఫిబ్రవరి 3: ఆధార్.. ఇప్పుడు ఇక్కడికి వెళ్లినా ఎదుటివారి నుంచి ఎదురయ్యే తొలి ప్రశ్న ఇది! ఆధార్ ఇక జనజీవనంలో ఒక ప్రధాన అంశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తోంది. ఆధార్ ఇప్పుడు అన్నింటికీ ఆధారమైన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే ముందుగా గ్రహించి రాష్ట్రంలోని అనేక సర్వీసులను, సేవలను, వ్యవస్థలను ఆధార్‌తో అనుసంధానించింది.

02/04/2017 - 04:22

విజయవాడ (స్పోర్ట్స్), ఫిబ్రవరి 3: రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఎపి స్పోర్ట్స్ లీగ్‌ను ఏర్పాటుచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఎపిఓఏ) సన్నాహలు చేస్తున్నట్టు ఎపిఓఏ కార్యదర్శి ఆర్‌కె పురుషోత్తం తెలిపారు. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో ఎపిఓఏ అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది.

02/04/2017 - 04:22

కాకినాడ, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్టస్థ్రాయి 5వ లక్ష గోపిడకల యజ్ఞం, సప్తగోమాత, తులసీ మాతలకు లక్ష ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య తెలియపారు.

Pages