S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/03/2017 - 04:46

అమరావతి, ఫిబ్రవరి 2: ‘రాష్ట్రంలో సులభతర వాణిజ్య సరళిని అమలు చేస్తూ పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం. వాటికి ఓడ రేవులు, జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ వౌలిక వసతులూ మార్కెటింగ్ సదుపాయాలూ కల్పిస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రా ష్ట్రం ఆర్థికంగాను సుస్థిర అభివృద్ధి సాధిస్తుంది.

02/03/2017 - 04:43

అమరావతి, ఫిబ్రవరి 2: ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ బలంపై ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గతంగా ఆయన జోరుపై తెలుగుదేశం పార్టీలో అలజడి పెరుగుతోంది. జగన్ సభలకు పోటెత్తుతున్న జనవాహిని అటు పార్టీ క్యాడర్‌నూ ఆందోళన పరుస్తోంది. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్‌ల వైఫల్యమే వైసీపీ బలపడేందుకు కారణమని క్యాడర్ ఆరోపిస్తున్నారు.

02/03/2017 - 04:42

మైలవరం, ఫిబ్రవరి 2: ఫేస్‌బుక్ అప్‌డేట్స్ విషయంలో తలెత్తిన వివాదం ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. దాడిచేసిన వారిలో ఎంపి బంధువు కుమారుడు, ఇంటిలిజెన్స్ ఎస్‌ఐ కుమారుడు ఉన్నట్టు తెలిసింది. వీరంతా ఎంపి స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చి దాడి చేయటం గమనార్హం.

02/03/2017 - 04:41

విజయవాడ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వమే వీరి పట్ల వివక్ష చూపుతుంటే వీరి బతుకులు ఏమికావాలంటూ గురువారం ఇక్కడి సబ్ కలెక్టరేట్‌లో విచారణ చేపట్టిన ఎస్సీ జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ కమలమ్మ ఎదుట వివిధ పక్షాలు, సంఘం ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

02/03/2017 - 04:41

అనంతపురం, ఫిబ్రవరి 2: అనంతపురం జిల్లాలో పవన విద్యుత్ (విండ్ మిల్ పవర్) వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఏర్పాటు చేసిన గాలిమరల ద్వారా మొత్తం 455.4 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ లక్ష్యం సాధించారు. అదనంగా మరో 750 నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నెడ్‌క్యాప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

02/03/2017 - 04:40

శ్రీకాకుళం, ఫిబ్రవరి 2: అరసవల్లిలో ఆదిత్యుని జయంతి ఉత్సవం గురువారం అర్థరాత్రి నుంచి ప్రారంభ కానున్నది. వెలుగుల రేడు శ్రీ సూర్యనారాయణస్వామి జయంత్యుత్సవం సందర్భంగా మాఘ శుద్ధ సప్తమీ శుక్రవారం రథసప్తమి పండుగ కన్నులపండువుగా దేవాదాయశాఖ నిర్వహించనుంది. గురువారం రాత్రి 12.15 గంటల నుంచి మహాక్షీరాభిషేక సేవ ప్రారంభం అవుతుంది.

02/03/2017 - 04:40

విజయవాడ, ఫిబ్రవరి 2: ప్రజల్ని మోసగించడంలో, రోజుకో మాట మార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు మించినవారు దేశంలో మరెవ్వరూ లేరని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు.

02/03/2017 - 04:39

విజయవాడ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్‌కు అత్యంత కీలకమైన విభజన హామీలతో కూడిన ప్రత్యేక హోదా అమలుకోసం చింతా రాజశేఖర్ అనే యువకుడు సోషల్ మీడియా మిత్రులు కొందరితో కలిసి 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాజశేఖర్ తాను చేపట్టే బైక్ ర్యాలీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

02/03/2017 - 03:33

విజయనగరం, ఫిబ్రవరి 2: ఒడిశాలోని పొత్తంగి బ్లాక్ సుంకి వద్ద పోలీస్ వాహనాన్ని మావోలు పేల్చి వేసిన సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించి ఎఒబిని జల్లెడ పడుతున్నారు. కటక్‌లోని అంగూల్ పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందేందుకు బయలుదేరిన పోలీసు వాహనాన్ని మావోలు మందుపాతరతో పేల్చివేసిన విషయం విదితమే.

02/03/2017 - 03:30

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 2: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ముక్కంటీశుడు కొలువుదీరి ఉన్న శ్రీ కాళహస్తి ఆలయ రాజగోపురం పునర్‌నిర్మాణమైన నేపథ్యంలో గురువారం కుంభాభిషేకం భక్తుల శివ నామస్మరణలు, వేద మంత్రాలు మధ్య వైభవంగాప్రారంభమైంది. ఈక్రమంలో గురువారం వేకువ జామున హోమాలతో ప్రారంభమై కలశస్థాపన చేశారు.

Pages