S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/03/2017 - 02:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్లకార్డ్ ప్రదర్శించారు. అయితే దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో ప్లకార్డ్ ప్రదర్శించవద్దని విజయసాయి రెడ్డికి విజ్ఞప్తి చేయడంతో ఆయన వెనక్కి తగ్గారు.

02/03/2017 - 04:38

విశాఖపట్నం, ఫిబ్రవరి 2: విశాఖ ఉత్సవ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుంది. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఆర్‌కే బీచ్ వేదికగా వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ ఉత్సవాలను కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తారు.

02/02/2017 - 08:18

* రాజకీయాల్లో సంస్కరణలకు శ్రీకారం
* క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపుతో రాజధాని రైతులకు మేలు
* నర్సరీలపై పన్ను సరికాదు
* రైల్వే జోన్, గిరిజన వర్సిటీపై వెనక్కి తగ్గేది లేదు
* కార్యరూపం దాలుస్తున్న డిజిటలైజేషన్ కమిటీ సిఫార్సులు
* మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

02/02/2017 - 08:18

ఏలూరు, ఫిబ్రవరి 1:‘దేశంలోనే...కాదు ప్రపంచంలోనే ఇలాంటి నిర్మాణం జరగలేదు... అలాంటి చరిత్రను పోలవరం ద్వారా సృష్టిస్తున్నాం... ఈ చరిత్రలో భాగస్వాములు కండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అన్నివర్గాలకు పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన పనుల్లో భాగంగా డయాఫ్రమ్ వాల్, క్రస్ట్ గేట్ల నిర్మాణ పనులను బుధవారం ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ప్రారంభించారు.

02/02/2017 - 08:12

విజయవాడ, ఫిబ్రవరి 1: ముస్లింలారా నన్ను నమ్మండి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మీ భద్రత విషయంలో న్యాయం చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. త్వరలో ముస్లింల కోసం మరో 25 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న మైనార్టీ సంక్షేమ పథకాలపై బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.

02/02/2017 - 07:59

అమరావతి, ఫిబ్రవరి 1: రాష్ట్భ్రావృద్ధికి అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. కేంద్రం నుంచి రావలసిన అన్నిరకాల నిధులు రాబట్టాలని నిర్ణయించింది. వివిధ పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరం 2016-17లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నిటినీ పూర్తిగా వినియోగించుకోడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక రెండు నెలలే సమయం ఉంది.

02/02/2017 - 07:44

మూలధన లాభాల్లో పన్ను మినహాయింపు రైతుల సంబరాలు
బాబుకు అభినందన సచివాలయం వద్ద పండుగ వాతావరణం

02/02/2017 - 07:41

ఆరుగురు పోలీసుల దుర్మరణం

ఏఓబిలో మావోయిస్టుల ఘాతుకం మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
మృతులంతా ఒడిశావాసులే సుంకి- సాలూరు హైవేపై నిలిచిన వాహనాలు

02/01/2017 - 04:50

విజయవాడ, జనవరి 31: చేనేత పరిశ్రమ అభివృద్ధికి త్వరలో ‘చేనేత విధానం’ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మంగళవారం వెలగపూడి సచివాలయంలో చేనేత సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి సమస్యలు వివరించారు.

02/01/2017 - 04:50

హిందూపురం, జనవరి 31: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఓటమి ఎరగని అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో అసమ్మతి రాజుకుంటోంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తీరుపై పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

Pages