S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/01/2017 - 04:49

విశాఖపట్నం, జనవరి 31: దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారని, దీనిలో ఎటువంటి అక్రమాలకు తావు లేదన్నారు.

02/01/2017 - 04:49

తిరుపతి, జనవరి 31: శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపధ్యంలో గత వారం రోజులుగా స్వైన్ ఫ్లూ జ్వరం పెరుగుతున్న క్రమంలో శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రుయా స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులో ఇప్పటికే ముగ్గురు చికిత్స పొందుతుండగా, వారికి స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయింది.

02/01/2017 - 04:48

అనంతపురం, జనవరి 31: వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న అనంతపురం జిల్లా ఉరవకొండలో జలదీక్ష చేపట్టబోతున్నారు. హంద్రీ నీవా ద్వారా ఉరవకొండ, పరిసర మండలాల్లోని 80 ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి జగన్ జలదీక్ష చేపడుతున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.

02/01/2017 - 04:48

ఇబ్రహీంపట్నం, జనవరి 31: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో అడగ్గానే బాకీ తీర్చలేదనే కోపంతో స్నేహితుడు కత్తితో దాడి చేయటంతో సూడాన్ దేశానికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం సిఐ చవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాయత్రినగర్‌లోని ఒక భవనంలో సూడాన్ దేశానికి చెందిన ఆరుగురు విద్యార్థులు నివాసముంటూ జూపూడి గ్రామంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో బి.్ఫర్మశీ చదువుతున్నారు.

02/01/2017 - 04:47

గుంటూరు, జనవరి 31: దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని క్రమశిక్షణకు ఎవరూ అతీతులు కారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ విధివిధానాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం గుంటూరులోని రాష్టప్రార్టీ కార్యాలయంలో టిడిపి సంస్థాగత ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

02/01/2017 - 05:00

విజయవాడ, జనవరి 31: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి మార్చి 1 నుంచి నూరు శాతం స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రానున్న మూడేళ్లలో ఎన్టీఆర్ జలసిరి కింద 1.2 లక్షల బోర్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఎన్టీఆర్ జలసిరి పథకంపై మంగళవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

02/01/2017 - 04:45

గన్నవరం, జనవరి 31: విజయవాడ గన్నవరం విమానాశ్రయం సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్‌ను మంగళవారం లారీ ఢీకొనడంతో కలకలం రేగింది. విశాఖపట్నం నుండి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ లారీ విజయవాడ ఆటోనగర్‌కి వెళుతుండగా, ఎయిర్‌పోర్ట్ సమీపంలో మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ తనిఖీ నిమిత్తం ఆగింది. ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ ..

02/01/2017 - 04:44

విజయవాడ, జనవరి 31: వెలగపూడి సచివాలయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనితీరుపై అధికారులను అడిగితెలుసుకున్నారు. మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, శాసన మండలి పనులు వారం రోజుల్లో పూర్తి అవుతాయని మంత్రికి అధికారులు వివరించారు.

02/01/2017 - 02:42

మార్తి సుబ్రహ్మణ్యం

02/01/2017 - 02:38

విజయవాడ, జనవరి 31: కాంగ్రెస్ పార్టీ విధానాల వల్లే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి తమ ప్రభుత్వం 541 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు.

Pages