S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/31/2017 - 03:02

హైదరాబాద్, జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో 10,11 లను విడుదల చేసినట్టు యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డిలు తెలిపారు. రూరల్ మండల విద్యాశాఖాధికారులుగా జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులను, అర్బన్ మండల విద్యాశాఖాధికారులుగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను నియమించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

01/31/2017 - 03:01

హైదరాబాద్, జనవరి 30: అక్రమ పెట్టుబడి కేసులో సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుండి వైఎస్‌ఆర్ సిపి అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డిని మినహాయిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మినహాయింపు ఉత్తర్వులు ఫిబ్రవరి 15 వరకూ అమలులో ఉంటాయి.

01/31/2017 - 02:59

విజయవాడ, జనవరి 30: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన వివిధ హామీలను సాధించే దిశగా పార్లమెంటులో తమ వాణి వినిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్బోధించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.

01/31/2017 - 02:58

విజయవాడ, జనవరి 30: వివిధ విభాగాల్లో ఉద్యోగాల నిమిత్తం నిర్వహించే మూడు పోటీ పరీక్షలు ఒకే రోజు నిర్వహించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షను ఫిబ్రవరి 26న నిర్వహించేందుకు ఎపిపిఎస్‌సి నిర్ణయించింది. ఆదే రోజున సిండికేట్ బ్యాంక్ 400 ప్రోబేషనరీ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి పరీక్ష నిర్వహించనుంది.

01/30/2017 - 04:19

గుంటూరు, జనవరి 29: నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన మరిన్ని డంప్‌లు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వినుకొండ నియోజకవర్గం రేమిడిచర్ల అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న డంప్ కొద్దిపాటిదే అయినప్పటికీ దట్టమైన అటవీ ప్రాంతంలో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు, ఇతరత్రా సామగ్రిని దాచి ఉంటారనే సందేహాలు వ్యక్తవౌతున్నాయి.

01/30/2017 - 04:17

విజయవాడ (క్రైం), జనవరి 29: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ‘మహిళా రక్షక్’కు ఇప్పుడు రక్షణ అవసరమా? అంటే అవుననే చెప్పాలి. పబ్లిక్‌గా యువతులు, మహిళలను వేధించే మృగాళ్లను కనిపెట్టి పనిపట్టేందుకు ప్రయోగాత్మకంగా విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ‘మహిళా రక్షక్’పై అప్పుడే దాడులు మొదలయ్యాయి.

01/30/2017 - 04:11

విజయవాడ, జనవరి 29: విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్టవ్య్రాప్తంగా సోమవారం జూనియర్ కళాశాలలను బంద్ చేసి యాజమాన్యాలు, అధ్యాపకులు ధర్నాలు, రాస్తారోకోలు జరిపి అధికారులకు విజ్ఞాపనలు ఇవ్వనున్నారు.

01/30/2017 - 04:10

విజయవాడ, జనవరి 29: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు వీలుగా కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు ఆశిస్తున్నారు.

01/30/2017 - 04:09

బాపట్ల, జనవరి 29: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలకు మించిన లబ్ధిని కేంద్రం ప్యాకేజీ ద్వారా అందిస్తుందని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికీ లభించనంత పెద్దమొత్తంలో నిధులు మంజూరు కానున్నాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల సహాయ మంత్రి సుజనా చౌదరి అన్నారు.

01/30/2017 - 04:09

విజయవాడ, జనవరి 29: రాష్ట్రంలోని గురుకులాలను దేశంలోనే మొదటి స్థానంలో నిలపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు.

Pages