S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/30/2017 - 02:44

అమరావతి, జనవరి 29: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలు, కులాల వారీగా జరుగుతున్న ముక్కోణ సమరం ఆసక్తికరంగా మారింది. అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముగ్గురు నేతలను ఎదుర్కోవడంలో మునిగిపోయింది. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ తన తండ్రి కార్డును పక్కకు పెట్టి, సొంత ఇమేజ్‌తోనే సర్కారుపై పోరాడే స్థాయికి ఎదిగారు. వైసీపీకి సిపిఎం కొత్త మిత్రుడిగా మారింది.

01/30/2017 - 02:41

కడప, జనవరి 29: కడప జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆదివారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఒక పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఫారెస్టు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, నలుగురు ఫారెస్టు ప్రొటెక్షన్ వాచర్లు, ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్నట్లు వివరించారు.

01/30/2017 - 02:40

తిరుపతి, జనవరి 29: తిరుమలలో ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించేందుకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న భక్తులను కాపాడేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా టిటిడికి ఒక రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. ఆదివారం తిరుమలలో పోలీస్ మిత్ర అవగాహన సమావేశం స్థానిక పుష్పగిరి మఠంలో పోలీస్, రక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.

01/30/2017 - 02:39

హైదరాబాద్, జనవరి 29: పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు పోరాడాలని వైకాపా పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఒక వేళ కేంద్రం తమ డిమాండ్‌ను ఆమోదించకుండా, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అటకెక్కించే ప్రయత్నం చేస్తే ఎంపి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలను కోరారు.

01/30/2017 - 02:39

భీమవరం, జనవరి 29: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న జాతీయ కార్టింగ్ ఛాంపియన్‌షిప్-2017 పోటీలు ఆదివారం ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ విశ్వవిద్యాలయాల జట్లు పోటీ పడ్డాయి. నిర్ణీత కాలంలో వేగంగా కార్టింగ్‌ను నడపాలి. తక్కువ సమయంలో ట్రాక్‌ను పూర్తిచేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.

01/29/2017 - 04:36

కాకినాడ, జనవరి 28: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య భద్రత పట్ల మరింత బాధ్యత పెరగాల్సి ఉందని, ఇందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు చైతన్యవంతమై ప్రభుత్వాలతో కలసి పని చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహం పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం, ఆహారం, ఉపాధి భద్రత కోసం మరిన్ని పటిష్టమైన చర్యలు అవసరమని, ఇందుకు ప్రతివొక్క స్వచ్ఛంద సంస్థ చైతన్యవంతం కావాలని కోరారు.

01/29/2017 - 04:34

సింహాచలం, జనవరి 28: కాలుష్యరహిత వనరుల వినియోగం పెరిగితే దేశం భవిష్యత్తులో అగ్ర రాజ్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి, శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం సుమారు 5.75 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

01/29/2017 - 04:33

అమరావతి, జనవరి 28: అన్ని కార్యక్రమాలను ఒక భారీ ఈవెంట్‌లా నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం ఇకపై వాటిని నిర్వహించే పెద్ద కంపెనీలను వెతుక్కోవలసిందే! ఎందుకంటే, ఏపికి వచ్చి కష్టాలు పడేందుకు సిద్ధంగా లేమని భారీ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి కాబట్టి!

01/29/2017 - 04:33

రాజమహేంద్రవరం, జనవరి 28: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్తవ్రేత్తలు తలపెట్టిన పిఎస్‌ఎల్వీసి 37 రాకెట్ ప్రయోగం ద్వారా 103 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాలరేవువద్ద విద్యార్థులు రాకెట్ నమూనాలో నిలుచుని శుభాకాంక్షలు తెలియజేశారు.

01/29/2017 - 04:30

విశాఖపట్నం, జనవరి 28: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో రూ.1.24 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు 62 అవగాహన ఒప్పందాలు కుదిరాయని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖలో రెండు రోజులుగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో శనివారం ఈ మేరకు పెట్టుబడిదార్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆయన వెల్లడించారు.

Pages