S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/23/2017 - 04:37

విజయవాడ, జనవరి 22: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించిన ఎయిమ్స్ (్ఢల్లీ)కి చెందిన నలుగురు సభ్యుల కేంద్ర బృందం ఐదు తాత్కాలిక పరిష్కారాలను సూచించింది. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఈ బృందం సభ్యులు ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. త్వరలో ఈ అంశంపై నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

01/23/2017 - 04:36

తాడిపత్రి, జనవరి 22: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామం సమీపంలో ఆదివారం చిత్రావతినదిలో భూమి కుంగిపోయింది. సంవత్సర కాలంలోనే చిత్రావతి నదిలో ఇలా రెండుసార్లు భూమి కుంగిపోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిత్రావతి నదిలో దాదాపు 50 న 20 అడుగుల వెడల్పుతో గుండ్రని గొయ్యి ఏర్పడిందన్నారు. చిత్రావతి నదికి దాదాపు 15 సంవత్సరాల నుంచి నీరు రాకపోవడంతో ఏరుమొత్తం వట్టిపోయిందన్నారు.

01/23/2017 - 04:35

కడప, జనవరి 22: కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా జలాలను వామికొండ రిజర్వాయర్‌కు విడుదల చేసేందుకు అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా నేతలు పోటీపడ్డారు.

01/23/2017 - 04:04

విజయవాడ, జనవరి 22: ఎల్లవేళలా సమాజ హితం కోరుకునే బ్రాహ్మణులు నేడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి వున్న తరుణంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఎపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు ఏటా కనీసం రూ.500 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నాడిక్కడ జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో సంఘం నేతలు డిమాండ్ చేశారు.

01/23/2017 - 03:53

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 22: రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగాలని ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి తీసుకుంటున్న చర్యలతో పాటు దావోస్ పర్యటనలపై కలిగిన లాభనష్టాలను వివరిస్తూ శే్వతపత్రాన్ని విడుదల చేయాలని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

01/23/2017 - 03:51

విజయవాడ, జనవరి 22: ప్రధాన రాజకీయ పక్షాల్లో శాసనమండలి ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఒకసారి శాసన మండలిలోకి ప్రవేశిస్తే ఆరేళ్లపాటు నిశ్చింతగా వుండవచ్చు. మరో రెండేళ్లలో శాసనసభకు సాధారణ ఎన్నికలు ఎటూ రాబోతున్నాయి. అప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తమ స్థానం ఆపై నాలుగేళ్లపాటు సుస్థిరంగా వుంటుంది.

01/23/2017 - 03:50

విజయవాడ, జనవరి 22: హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రన్న బీమా పథకం కింద ఈ మొత్తం చెల్లించనున్నట్లు తెలిపారు. విజయవాడ ఉండవల్లిలోని తన నివాసంలో రైలు ప్రమాద ఘటన వివరాలు ఆయన తెలుసుకొని పరిస్థితిని సమీక్షించారు.

01/23/2017 - 03:46

విశాఖపట్నం, జనవరి 22: కూనేరు రైల్వేస్టేషన్ సమీపాన జరిగిన రైలు దుర్ఘటన కారణంగా సంఘటనా సంఘటనా స్థలం నుంచి ప్రయాణికులు బయలుదేరి వెళ్ళేందుకు వీలుగా ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ అధికారులు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశారు. ఇందులోభాగంగా జగదల్‌పూర్-జునాగఢ్ రోడ్డు-్భవనేశ్వర్ (18448) హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ను 13 కోచ్‌లతో నిర్వహిస్తున్నారు.

01/23/2017 - 04:05

విజయవాడ (పాతబస్తీ), జనవరి 22: కాళ్లు, చేతులు కట్టుకుని కృష్ణానదిలో మూడు కిలోమీటర్లు ఈది గతంలో రికార్డు నెలకొల్పిన హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా మృతి చెందాడు. విజయవాడ ఎపి ఎన్‌పిఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు(45)కు ఆదివారం ఉదయం గుండెపోటు రావటంతో బందరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

01/23/2017 - 02:29

శ్రీకాళహస్తి, జనవరి 22: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి ముక్కంటీశుని ఆలయ గోపుర నిర్మాణం పూర్తయిన నేపధ్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో పాల్గొనడం సాక్షాత్తు ఆ శివయ్య.. ఆజ్ఞగా భావించి వచ్చానని, ఇది తన పూర్వ జన్మసుకృతమని రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఉద్వేగంగా అన్నారు. శ్రీకాళహస్తిలో అతిరుద్ర మహాయాగాలలో ఆదివారం మెగాస్టార్ చిరంజీవి దంపతులు పాల్గొన్నారు.

Pages