S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/30/2016 - 05:29

తిరుపతి, డిసెంబర్ 29: ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించడానికి టాస్క్ఫోర్స్ ఏర్పాటుతో 70శాతం స్మగ్లింగ్‌ను నియంత్రించగలిగామని డిజిపి సాంబశివరావు చెప్పారు.

12/30/2016 - 05:28

మడకశిర, డిసెంబర్ 29: దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి మోసం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

12/30/2016 - 05:27

అమరావతి, డిసెంబర్ 29: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనుల కోసం శరవేగంగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టులు, రోడ్లు, జలమార్గాలు, బీచ్ కారిడార్, తదితర ప్రాజెక్టులకు నిర్ణయించిన ప్రకారం భూసమీకరణ జరపాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భూముల ధరలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా భూసమీకరణ, లేక భూసేకరణ చేయనున్నారు.

12/30/2016 - 05:26

కాకినాడ, డిసెంబర్ 29: కాపులను బిసిలుగా గుర్తించాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు రాష్ట్ర కాపు జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. 13 జిల్లాల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఇళ్ళకు కాపు జెఎసి నేతలు వెళ్ళి వినతిపత్రాలు అందజేస్తారని జెఎసి రాష్ట్ర నేత వాసిరెడ్డి ఏసుదాసు తెలియజేశారు.

12/30/2016 - 05:26

అనంతపురం, డిసెంబర్ 29: రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూ.120 కోట్లు ఖర్చు చేయనున్నామని పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యు ఎస్, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ శాఖల మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. అనంతపురం నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 13 జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రణాళిక రూపొందించామన్నారు.

12/30/2016 - 05:25

ఖమ్మం, డిసెంబర్ 29: సత్తుపల్లి జిల్లా ఏర్పాటు కోరుతూ గత రెండు నెలలుగా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల ప్రజలు అలుపెరుగని ఆందోళన జరుపుతున్నారు. రెండు నెలలుగా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులు జిల్లా ఏర్పాటును కాంక్షిస్తూ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం పట్ల ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

12/30/2016 - 02:09

హైదరాబాద్, డిసెంబర్ 29: ఆంధ్ర థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్తమ టెక్నాలజీ విధానాలను అమలు చేసి నాణ్యమైన ఉత్పత్తిని చేసినందుకు ఏపి జెన్కో సిఎండి కె విజయానంద్‌కు, ఇంధన సంరక్షణ పద్ధతుల్లో అత్యుత్తమ విధానాలను అవలంభించినందుకు ఇంధన సంరక్షణ సంఘం సిఇవోఎ చంద్రశేఖర రెడ్డికి కేంద్రం అవార్డులను ప్రకటించింది.

12/30/2016 - 02:08

అమరావతి, డిసెంబర్ 29: గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్నది 70 ఏళ్ల నాటి కల. సాగునీరు, మంచినీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పరుగులు తీయడం ప్రారంభించింది.

12/30/2016 - 02:06

రాజమహేంద్రవరం, డిసెంబర్ 29: గోదారి జిల్లాల్లో రబీ నాట్లకు నోట్ల దెబ్బ తగిలింది. చిల్లర నోట్లు ఉంటేనే పనుల్లోకి వస్తామని కూలీలు రైతులకు చెప్తుండటంతో దాదాపు సగం విస్తీర్ణంలో నాట్లు మందగించాయి. ప్రస్తుతం అత్యధికంగా రూ.2000 నోట్లు మాత్రమే చెలామణీలో ఉండగా, రూ.500 నోట్లు ఎవరికీ అందుబాటులో లేవు.

12/30/2016 - 02:05

సూళ్లూరుపేట/తడ, డిసెంబర్ 29: సూళ్లూరుపేటలో మూడు రోజుల నుండి జరుగుతున్న పక్షుల పండుగ సంబరాలు గురువారంతో ఘనంగా ముగిసాయి. సూళ్లూరుపేట, నేలపట్టు, బివిపాళెం వేదికగా మంగళవారం నుండి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. తొలిరోజు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు.

Pages