S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/09/2015 - 11:30

విజయవాడ:2018 నాటికి పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఎపి సిఎం చంద్రబాబు చెప్పారు. ఆయన బుధవారం మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పోలవరం పనుల తీరును తెలుసుకున్నారు. నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలందరూ ముందుకు తీసుకెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు. కరువు రహిత రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దేందుకు అందరూ కృషిచేయాలన్నారు.

12/09/2015 - 11:30

ఏలూరు:జీలుగుమిల్లి మండలం పాకాలగూడెం వద్ద మంగళవారం అర్థరాత్రి అడవిలో ఓ అంగతకుడు పుర్రెలు, ఎముకలు పెట్టి క్షుద్రపూజ జరిపాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారి కళ్ళుగప్పి ఆ అగంతకుడు పరారయ్యాడు. అపరిచిత వ్యక్తుల సంచారంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12/09/2015 - 11:28

విశాఖ:పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో కూడా మంచు కురుస్తున్నందున రహదారులు కన్పించడంలేదు. లంబసింగి, మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11, చింతపల్లిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

12/09/2015 - 11:28

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో దుర్భిక్ష పరిస్థితులను అంచనా వేసేందుకు ఢిల్లీనుంచి కేంద్ర ప్రతినిధుల బృందం బుధవారం నుంచి పర్యటిస్తోంది. కర్నూలు, ప్రకాశం, కృష్ణా, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ బృందం పర్యటించి రైతులను, స్థానిక అధికారులను కలుసుకుంటుంది.

12/09/2015 - 11:27

శ్రీకాకుళం:ఇక్కడి ట్రెజరీ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యలమంచిలి భారతీలక్ష్మికి చెందిన ఆస్తులపై బుధవారం ఉదయం ఏసిబి అధికారులు సోదాలు ప్రారంభించారు. శ్రీకాకుళం, విశాఖ, హైదరాబాద్‌లలో ఆమె ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసి భారీ స్థాయిలో అక్రమాస్తులు వున్నట్లు కనుగొన్నారు. ఒక్క శ్రీకాకుళంలోనే ఆమెకు కోటి రూపాయల మేరకు ఆస్తులున్నట్లు కనుగొన్నారు.

12/09/2015 - 11:27

కాకినాడ: చింతూరు మండలం వేగితోటవద్ద బుధవారం ఉదయం గిరిజనులమధ్య ఘర్షణ చోటుచేసుకోగా పరస్పరం బాణాలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

12/08/2015 - 16:01

విజయవాడ : కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ఆయన వెల్లడించారు.

12/08/2015 - 15:54

విజయవాడ : స్వర్ణభారత్ కల్తీ మద్యం ఘటనతో మల్లాది విష్ణుకు సంబంధం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా తేల్చిచెప్పారు. మల్లాది విష్ణును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, మృతుల కుటుంబాలకు మద్యం కంపెనీల నుండి నష్టపరిహారం అందించేలా చట్టం తీసుకరావాలని సూచించారు.

12/08/2015 - 14:05

విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పనులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు పరిశీలించారు. విజయవాడ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆయన వెంకటాపురం చేరుకుని అక్కడ నుంచి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. మెగా ఇంజినీరింగ్ కంపెనీ డైరెక్టర్ పనులను వివరించారు.

12/08/2015 - 14:02

కర్నూలు: సిరివెల్లమెట్ట వద్ద జాతీయరహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Pages