S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/28/2016 - 02:51

విశాఖపట్నం, డిసెంబర్ 27: సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయాలని విదేశీ వాణిజ్య వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కలోక్ త్రివేది అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై ఆక్వా రంగ ప్రతినిధులతో విశాఖలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చేపట్టినట్టు తెలిపారు.

12/28/2016 - 02:50

విశాఖపట్నం, డిసెంబర్ 27: మంజూరైన పనులు ఏళ్ల తరబడి పూర్తికాకుండా ఉంటున్నాయి. పనుల అంచనాలు పెరుగుతూ ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. మంజూరైనప్పటి రేట్లను మార్చాలంటూ అధికారులే సిఫారసులు చేస్తున్నారు. అసలు మీ ఉద్దేశం ఏమిటంటూ ఇంజనీరింగ్ అధికారులపై తీరుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

12/28/2016 - 02:50

పోలవరం, డిసెంబర్ 27: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టులోని స్పిల్‌వే కాంక్రీటు పనులు ప్రారంభించడానికి ఈ నెల 30న వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోపాటు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు డిజిపి ఎన్ సాంబశివరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను డిజిపి సాంబశివరావు, డిఐజి రామకృష్ణారావు, ఎస్పీ భాస్కర్ భూషణ్ మంగళవారం పరిశీలించారు.

12/28/2016 - 02:26

గుంటూరు, డిసెంబర్ 27: అధికార పార్టీలో వర్గ విభేదాలకు కాంట్రాక్టులు, కమీషనే్ల ప్రధాన కారణంగా తెలుస్తోంది. మంత్రి రావెల కిషోర్‌బాబుతో తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైన సంగతి విదితమే. విభేదాలు తారస్థాయికి చేరడంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరి మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించారు.

12/28/2016 - 02:24

హైదరాబాద్, డిసెంబర్ 27: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో ఆశించిన స్పందన రాలేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల కొనుగోలుకు సంబంధించి 58 బిడ్స్‌కు 52 బిడ్స్ తెరిస్తే స్పందన సానుకూలంగా లేదని హైకోర్టు పేర్కొంది. విజయవాడ పరిసరాల్లోని కొన్ని ఆస్తులకు అసలు బిడ్స్ రాలేదని హైకోర్టు తెలిపింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెన్సీలు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది.

12/28/2016 - 02:23

తిరుపతి, డిసెంబర్ 27: భవిష్యత్‌లో ప్రపంచాన్ని నిర్దేశించే శక్తి సామర్థ్యాలను భారతదేశం సముపార్జించుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. చైనా, అమెరికా, భారత్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తున్నా అంతిమ విజయం మాత్రం భారత్‌దేనని చెప్పారు.

12/28/2016 - 02:23

కాకినాడ, డిసెంబర్ 27: ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్య వైఖరి, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తోన్న తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ నరసింహరావును సస్పెన్షన్ చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశం తీర్మానించి ఆమోదించింది.

12/28/2016 - 01:11

తిరుపతి, డిసెంబర్ 27:రాష్ట్ర విభజన నేపధ్యంలో విపక్ష వైకాపా అభివృద్ధికి సహకరించాల్సిందిపోయి అడ్డుకుంటోందని, ఆ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గెలవకుంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం తిరుపతిలో జరిగిన 99వ ఆర్థిక సంఘం వార్షిక సమావేశంలో పాల్గొన్నారు.

12/28/2016 - 00:58

నెల్లూరు, డిసెంబర్ 27: మరో రెండు రోజుల్లో దేశ ప్రజలంతా తీపి కబురు వినబోతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో నగదు రహిత లావాదేవీలపై విద్యార్థులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

12/27/2016 - 04:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ‘ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా హీరో.. ఆయన పనిచేసినంత వేగంగా పనిచేయలేకపోతున్నామే అన్న బాధ కలుగుతుంది. ఆయనలా పనిచేయాలని మేమెప్పుడూ కోరుకుంటాం’’ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏపి సిఎం చంద్రబాబునాయుడిని పొగడ్తలతో ముంచెత్తారు.

Pages