S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/27/2016 - 03:39

అనంతపురం, డిసెంబరు 26: కేరళ రాష్ట్రం శబరిమలలో ఆదివారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో గాయపడినవారి వివరాలు అందక అయ్యప్ప భక్తులు, వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కాగా ఆదివారం నాటి ఘటనలో గాయపడిన అనంతపురం నగరం లక్ష్మీనగర్‌కు డి.రాజు కుమారుడు అఖిల్‌కుమార్(24)ను సోమవారం రాత్రి ఇక్కడికి తీసుకువచ్చారు. శబరిమల నుంచి నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

12/27/2016 - 03:36

విశాఖపట్నం, డిసెంబర్ 26: నగదు రహిత లావాదేవీలపట్ల అవగాహన కల్పించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఆన్‌లైన్‌లో బిల్ డెస్క్ గేట్ వే ద్వారా చెల్లింపులు నిర్వహిస్తున్న వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసిఎల్) సోమవారం ప్రోత్సాహక బహుమతులు అందజేసింది.

12/27/2016 - 03:34

నెల్లూరు, డిసెంబర్ 26: రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే పలు కేంద్ర రంగ సంస్థలు, విద్యాలయాలు ఏర్పడుతున్న తరుణంలో మరో కేంద్రస్థాయి విద్యాసంస్థ నెల్లూరులో ఏర్పాటవుతోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) కేంద్రాన్ని నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నిర్మించనున్నారు.

12/27/2016 - 03:33

రాజమహేంద్రవరం, డిసెంబర్ 26: గోదావరి నది మహా పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య విచారణ కమిషన్ గడువు హరించుకుపోతోంది. ఇప్పటికే ఐదుసార్లు కమిషన్ గడువు పొడిగించినప్పటికీ విచారణ కొలిక్కి రాలేదు. ఐదవసారి విచారణ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ ఇప్పటికీ విచారణ మొదలు కాలేదు.

12/27/2016 - 03:32

విశాఖపట్నం, డిసెంబర్ 26: అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడిన ఆర్ అండ్ బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుభాష్‌చంద్ర పాత్రో అక్రమ సంపాదన రూ.60 కోట్లకు చేరుకుంది. రెండు రోజుల కిందట పాత్రోసహా అతని బంధువుల ఇంట్లో ఎసిబి ఏకకాలంలో సోదాలు నిర్వహించగా రూ.4.8 కోట్ల మేర ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.50 కోట్లుగా ఎసిబి అంచనావేసింది.

12/27/2016 - 03:28

విజయవాడ, డిసెంబర్ 26: నూతన సంవత్సరం సమస్యల రహితం కావాలని, పెద్దనోట్ల రద్దు సమస్య సహా అన్ని సవాళ్లను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమవారం తన నివాసం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ రెండు మూడు రోజుల్లో పూర్తిచేయాలని, వచ్చే నెల నుంచి పాత పద్ధతిలోనే లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు.

12/27/2016 - 02:52

హైదరాబాద్, డిసెంబర్ 26: సంక్రాంతికి కోడి పందాలను అనుమతించవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కోడి పందాలు జరగకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, కమిషనర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది.

12/27/2016 - 02:51

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 26: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి తెలుగుతేజాలు హుస్నా సమీరా, అల్లాడ పావన్ నిదర్శనంగా నిలిచారు. క్యారమ్స్‌లో సోమవారం వీరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. విజయవాడలోని దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్యారమ్స్ మారథాన్ సోమవారం సాయంత్రంతో ముగిసింది.

12/27/2016 - 02:49

విజయవాడ, డిసెంబర్ 26: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,981 కోట్ల నాబార్డు రుణం చెక్కును కేంద్రం నుంచి అందుకోవడం నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో గొప్ప ముందడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. సోమవారం తన నివాసం నుంచి కలెక్టర్లు, ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులు, బ్యాంకర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/27/2016 - 02:47

సోమందేపల్లి, డిసెంబర్ 26: నోట్ల కష్టాలు అన్నీ ఇన్నీకావు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో సోమవారం కెనరాబ్యాంకు ముందు కనిపిస్తున్న ఈ చెప్పుల క్యూ చూస్తే జనం నోట్లకోసం ఎన్ని అగచాట్లకు గురువుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కెనరాబ్యాంకుకు నగదు వచ్చినట్లు తెలుసుకున్న ఖాతాదారులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఎండ మండుతుండడంతో నిలుచునేందుకు నీడలేక ఇలా చెప్పులు క్యూలో పెట్టి తమ వంతుకోసం వేచి ఉన్నారు

Pages