S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/27/2016 - 02:42

ఒంగోలు, డిసెంబర్ 26: సుమత్ర దీవుల్లో సంభవించిన భారీ భూకంపం ప్రభావంతో మన తీర ప్రాంతంలో సునామీ సంభవించి ప్రకాశం జిల్లాలోని కోస్తా తీరప్రాంత ప్రజల జీవన బతుకులను చిధ్రం చేసింది. 2004 డిసెంబర్ 26వ తేదీ ఉదయానే్న సునామీ సంభవించింది. సునామీ సంభవించి నేటికి 12సంవత్సరాలు పూర్తయింది.

12/27/2016 - 01:52

కాకినాడ, డిసెంబర్ 26: ఏ తల్లి చేసిన ఘోరమో అప్పుడే జన్మించిన ఇరువురు కవల శిశువులు రోడ్డు పాలయ్యారు. దిక్కుమొక్కు లేని స్థితిలో పడివున్న ముక్కుపచ్చలారని ఆడ, మగ శిశువులను స్థానికులు గమనించి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో సోమవారం వెలుగుచూసిన ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

12/27/2016 - 01:49

కడప, డిసెంబర్ 26: పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు ఏ విధంగా వస్తాయో ముఖ్యమంత్రే చెప్పాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టిసీమ నీరు ప్రకాశం బ్యారేజికి తరలిస్తే అవి కాస్తా సముద్రం పాలయ్యాయన్నారు. ప్రాజెక్టులకు టెంకాయలు కొట్టడమే ముఖ్యమంత్రికి చేత నవుతుందని ఎద్దేవాచేశారు.

12/27/2016 - 01:44

విజయవాడ, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి ఆదేశమంటే శిలాశాసనం. అయితే ఇందుకు భిన్నంగా ఆయన ఆదేశాలనే బేఖాతరు చేస్తూ, వెలగపూడి సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లు ప్రజల్ని వెక్కిరిస్తున్నాయి. తాత్కాలిక సచివాలయాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిరోజూ సచివాలయానికి వస్తున్నారు.

12/27/2016 - 01:43

వింజమూరు, డిసెంబర్ 26: నెల్లూరు జిల్లా వింజమూరు, ఉదయగిరి, కలిగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో మళ్లీ భూమి స్వల్పంగా కంపించింది. గత ఐదారు నెలలలుగా సద్దుమణిగిన భూ ప్రకంపనాలు మళ్లీ ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 2.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

12/26/2016 - 05:54

అశ్వాపురం, డిసెంబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం ఎస్సీ కాలనీకి చెందిన జెట్టి సురేష్ (32) తన భార్య సరితను (28), ఇద్దరు కుమారులు నరేందర్ (9), నాగచైతన్య(7)ను కిరాతంగా గొంతు నులిమి హతమార్చి తాను ఇంట్లోని పడక గదిలో దూలానికి చీరతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ విషాద సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

12/26/2016 - 05:50

విజయవాడ, డిసెంబర్ 25: రాష్ట్రంలో పౌరసరఫరాల వ్యవస్థను మరింత ప్రక్షాళన చేసేందుకు దిశగా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ- పాస్ విధానం ద్వారా ఇప్పటికే సరకుల పంపిణీలో మార్పులు తీసుకువచ్చినప్పటికీ, మరిన్ని లోపాలను గుర్తించి నిరోధించే పనిలో అధికార యం త్రాంగం నిమగ్నమైంది. స్మార్ట్ పల్స్ సర్వేకు, కార్డులదారుల మధ్య 29 ల క్షల యూనిట్లు తేడా రావడం, వాహనా ల ట్రాకింగ్ వంటి అంశాలపై దృష్టి సా రించారు.

12/26/2016 - 05:12

భీమవరం, డిసెంబర్ 25: రాష్ట్రంలోని వివిధ స్థాయిల్లో ఉన్న 3800 దేవాలయాల్లో భక్తుల సౌకర్యార్ధం స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఇప్పటివరకు 180 ప్రముఖ దేవాలయాల్లో ఈ యంత్రాలను సిద్ధంచేశామన్నారు.

12/26/2016 - 05:10

కడప, డిసెంబర్ 25: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు.

12/26/2016 - 05:07

విజయవాడ, డిసెంబర్ 25: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయికి ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశం గర్వించదగిన మహాదార్శనికుడు, పరిపాలనాదక్షుడు అటల్ బిహారీ వాజపేయి అని ప్రశంసించారు.

Pages