S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/26/2016 - 01:58

అమరావతి, డిసెంబర్ 25: ఆంధ్ర రాజధాని అమరావవతి బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే విధంగా ప్రణాళికలను అమలు చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ భవన నిర్మాణాలు, జాతీయ అంతర్జాతీయ స్ధాయి విద్య, వైద్య సంస్ధలు, వౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

12/26/2016 - 01:57

విజయవాడ, డిసెంబర్ 25: భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఊరూ వాడా సుపరిపాలన విస్తరిస్తోందని కేంద్ర సమాచార ప్రసార పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

12/26/2016 - 01:51

తిరుపతి, డిసెంబర్ 25: ఇప్పటి వరకు బలిజలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని, తమ అభివృద్ధిని మాత్రమే కాపులు చూసుకున్నారని, ఇకపై తమకు జరిగిన మోసం, దోపిడీ ముసుగును తొలగిస్తామని టిటిడి బోర్డు మాజీ సభ్యుడు, బలిజ సంఘం నేత ఓవి రమణ హెచ్చరించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపుల తీరుతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని బలిజ కులస్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

12/26/2016 - 01:22

గుంటూరు, డిసెంబర్ 25: ‘తొందరలో పొరపాటుపడ్డా.. మా ఇంటికి వచ్చింది మంత్రి రావెల కిషోర్‌బాబుకు చెందినవారు కాదని తెలిసింది.. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.. ఇకపై అందరం కలిసి పనిచేస్తాం’.. అంటూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్ సెలవిచ్చారు. మంత్రి రావెలపై ఆరోపణలు సంధించి, మీడియా ఎదుటే కన్నీరు పెట్టుకున్న జానీమూన్.. మంత్రులతో జరిపిన చర్చల అనంతరం ఆదివారం యూ టర్న్ తీసుకున్నారు.

12/26/2016 - 01:21

గుంటూరు, డిసెంబర్ 25: రాష్ట్రంలో పేదరికం లేని సమాజ నిర్మాణమే తన జీవిత లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని స్వస్థిశాలలో ఆదివారం జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రార్ధనలు నిర్వహించారు. స్వయంగా బైబిల్‌లోని వాక్యాలను చంద్రబాబు చదివి వినిపించారు.

12/25/2016 - 04:57

వేంపల్లె, డిసెంబర్ 24: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ చర్చిలో ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

12/25/2016 - 04:55

ఎర్రగుంట్ల/ప్రొద్దుటూరు రూరల్, డిసెంబర్ 24: నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు వస్తున్న డెమో రైలుకు శనివారం పెనుప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి శనివారం ఉదయం బయలుదేరిన డెమో రైలు(నెం.77401) ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్ దాటి ఎర్రగుంట్ల వస్తుండగా మార్గమధ్యంలో మాలేపాడు బ్రిడ్జివద్ద 114.6 కిమీ సమీపంలో రైలు పట్టా విరిగిపోవడంతో డ్రైవర్ అప్రమత్తమై నిలిపివేశారు.

12/25/2016 - 04:52

కరప, డిసెంబర్ 24: తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో శనివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ కుటుంబసభ్యులు సందడి చేశారు. హరికృష్ణ వియ్యంకుడు ఇంట్లో నిర్వహించిన మనవళ్ల పంచెకట్టు శుభకార్యానికి హరికృష్ణ తనయులు, ప్రముఖ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు కుటుంబసమేతంగా హజరయ్యారు.

12/25/2016 - 04:52

కాకినాడ, డిసెంబరు 24: గ్రామస్థాయి నుండి ప్రతిఒవొక్కరికీ ఆరోగ్య విజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వాస్థ్య వైద్య వాహిని కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

12/25/2016 - 04:51

కడప, డిసెంబర్ 24: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకుందామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ ఎత్తుగడలు, వ్యూహాలను తిప్పికొట్టాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Pages