S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/24/2016 - 07:48

అనంతపురం, నవంబర్ 23: అనంతపురం నగరంలోని ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయంపై బుధవారం ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన ఐటి అధికారుల బృందం బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కంపెనీ యజమాని అమిలినేని సురేంద్రబాబు కార్యాలయంలో లేరు.

11/24/2016 - 07:47

విజయవాడ, నవంబర్ 23: ఆన్‌లైన్ లావాదేవీల్లో, మొబైల్ బ్యాంకింగ్‌లో విద్యార్థులకు వర్కుషాపులు నిర్వహించాలని, ఆ తరువాత వారు ప్రజలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులను ఏపి సిఎం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో విద్యార్థుల వర్కుషాపుల నిర్వహణ పూర్తి చేసి, శనివారం నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజలకు మొబైల్ బ్యాంకింగ్‌లో శిక్షణ ఇచ్చేలా చూడాలని ఆదేశించారు.

11/24/2016 - 05:36

విజయవాడ, నవంబర్ 23: పేదలకు సైతం అత్యున్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో మరో 100 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పనితీరుపై బుధవారం సిఎం సమీక్ష నిర్వహించారు.

11/24/2016 - 05:34

గుంటూరు, నవంబర్ 23: భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విశ్వక్రీడలు, ఒలింపిక్స్‌కు వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాల నిర్మాణాన్ని చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బార్సిలోనా నగర డెప్యూటీ మేయర్ ఆంథోని సిఎం చంద్రబాబును కలిసి ఇందుకు అవసరమైన వౌలిక సదుపాయాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

11/24/2016 - 05:32

పుట్టపర్తి, నవంబర్ 23: ప్రేమమూర్తి పుట్టపర్తి సత్యసాయిబాబా 91వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని రకరకాల పుష్పాలతో అలంకరించారు. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు సత్యసాయి మహాసమాధి వద్ద ప్రణమిల్లారు.

11/24/2016 - 04:44

రాజమహేంద్రవరం, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని, అయితే దాన్ని అమలు చేసే విధానమే సక్రమంగా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంతమంచి నిర్ణయమైనా.. అమలు చేయటంలో లోపముంటే విఫలమవుతుందని, ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు.

11/24/2016 - 04:43

హైదరాబాద్, నవంబర్ 23: పోలీసులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని, ప్రజలను వేధించరాదని హైకోర్టు విజయవాడ పోలీసులకు హితవు చెప్పింది. పోలీసులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విజయవాడకు చెందిన గౌరీశ్వరి అనే మహిళ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

11/24/2016 - 04:42

అమరావతి, నవంబర్ 23: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మద్యం అమ్మకాల్లో జరుగుతున్న భారీ దోపిడీ, అవినీతిపై బిజెపి దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతిపై గత కొంతకాలంగా అధ్యయనం చేస్తున్న బిజెపి శాసనమండలి సభ్యుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడయిన సోము వీర్రాజు మద్యం అమ్మకాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.

11/24/2016 - 04:42

హైదరాబాద్, నవంబర్ 23: దేశంలో పెద్ద నోట్ల రద్దు, తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం చేస్తున్న సాయంపై ప్రజలకు వివరించేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా 26వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారని ఆ పార్టీ ఏపి నేత ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు.

11/24/2016 - 04:24

విజయవాడ, నవంబర్ 23: ‘ఒకటో తేదీ వస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వాలి. పింఛన్లు చెల్లించాలి.. ఇందుకు అవసరమైన కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చేలా తక్షణమే చర్యలు చేపట్టండి’ అంటూ బ్యాంకర్లను సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబర్ 1 నాటికి రాష్ట్రంలో 70 శాతం పైగా డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేశారు.

Pages